మధ్యప్రదేశ్ సీఎంకు కరోనా పాజిటివ్

మధ్యప్రదేశ్ సీఎంకు కరోనా పాజిటివ్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు మంగళవారం ట్వీట్ చేశారు. పరీక్షలు చేస్తే కోవిడ్ -19 పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు. అతనికి తేలికపాటి లక్షణాలు ఉన్నందున అతను ఇంట్లోతద ఒంటరిగా  ఐసోలేషన్‌లో ఉంటున్నారు. “నేను  RTPCRలో కోవిడ్ పరీక్ష చేయించుకున్నాను. అందులో నాకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. నాకు సాధారణ లక్షణాలు ఉన్నాయి. కోవిడ్ -19 మార్గదర్శకాలను అనుసరించి నేను ఒంటరిగా ఉన్నాను ”అని మధ్యప్రదేశ్ సిఎం ఒక ట్వీట్‌లో తెలిపారు. “రాబోయే అన్ని పనులను వర్చువల్‌గా చేస్తాను. రేపు, సంత్ శిరోమణి రవిదాస్ జయంతి కార్యక్రమంలో కూడా తాను వర్చువల్‌‌గా పాల్గొంటాను’, అని శివరాజ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 

ఇవి కూడా చదవండి:

ఏపీ డీజీపీకి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

సీఎం జగన్‌ను కలవనున్న మంచు విష్ణు