మధ్య ప్రదేశ్ లో అసెంబ్లీ బైపోల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ దాబ్రాలో కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ రాజే తరుపున నిర్వహించిన ప్రచారంలో బీజేపీ అభ్యర్ధి, ప్రస్తుత మంత్రి ఇమ్రతీ దేవీలాగా కాదు మన అభ్యర్ధి ఉండరు. చాలా నిరాడంబరంగా ఉంటారు. ప్రత్యర్ధి ఎలా ఉంటారంటూ కాంగ్రెస్ కార్యకర్తల్ని అడిగే ప్రయత్నం చేశారు. అందుకు కార్యకర్తలు రిప్లయ్ ఇస్తుండగా..కమల్ నాథ్ మాత్రం ఐటమ్ లా ఉంటారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సురేష్ నేను ఇద్దరం గ్వాలియర్ – చంబాల్ యువత అభివృద్ధికి కృషి చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామన్నారు.
కమల్ నాథ్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ గ్వాలియర్ – చంబాల్ ప్రాంతానికి చెందిన కూతురు, చెల్లెలితో సమానమైన ఇమ్రతీదేవీని విమర్శించడం తగదన్నారు. దళిత వర్గం నుంచి ఎంతో కష్టపడి కూలీ నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగి గ్వాలియర్ – చంబాల్ ప్రాంత అభివృద్దికి పాటుపడే ఇమ్రతీ దేవిని ప్రశ్నించే హక్కు ఎవరిచ్చారంటూ శివరాజ్ సింగ్.., కమల్ నాథ్ ను ప్రశ్నించారు.
