జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి : మధు గౌడ్​

వనపర్తి, వెలుగు : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే కృషి చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్​ అన్నారు.   వనపర్తి జిల్లా, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో  నూతనంగా రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికైన మధు గౌడ్ కు అభినందన సన్మాన సభ ఏర్పాటు చేశారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   తాను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక అయ్యేందుకు సహకరించిన యూనియన్ రాష్ట్ర, అధ్యక్ష కార్యదర్శులు విరహత్ అలీ, రామ్ నారాయణ లకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ  కార్యక్రమంలో యూనియన్ నాగర్ కర్నూల్ జిల్లా ఇన్​చార్జి శ్యామ్,  జిల్లా కార్యదర్శి మాధవ్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు ప్రశాంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు  రమేశ్, సీనియర్ పాత్రికేయులు ఉషన్న, పౌర్ణరెడ్డి, బి.రాజు,  ఎల్లా గౌడ్ పాల్గొన్నారు.