ఫోర్ లేన్ పనులు  ప్రారంభం

మద్దూరు, వెలుగు: మద్దూరు మండల కేంద్రంలో కోస్గి, నారాయణపేట మెయిన్ రోడ్డు విస్తరణ(4 లేన్) పనులు శనివారం ఎట్టకేలకు మళ్లీ ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఏడాది కింద ప్రారంభించిన ఈ పనులను సగం కూడా పూర్తి చేయకుండానే.. బిల్లులు కోసం కాంట్రాక్టర్ వదిలేశాడు. ఆ సమయంలో మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామని, రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలు, ఇండ్లను తొలగించారు.

దీంతో ఉపాధి పోయి రోడ్డున పడ్డ వారంతా శనివారం పనులను అడ్డుకున్నారు. ఎన్ని రోజుల్లో రోడ్డు పూర్తి చేస్తారో క్లారిటీ ఇచ్చాకే పనులు చేపట్టాలన్నారు.  సీఎం ఆదేశాలు ఉన్నాయని, అందరూ సహకరిస్తే రెండు నెలల్లో పూర్తి చేస్తామని ఏఈ తెలిపారు. దీంతో  పనులకు అడ్డు తొలిగారు.