స్టార్ హీరోయిన్ రెస్టారెంట్ లో పార్టీకి వెళ్లిన బిజినెస్ మెన్.. తిరిగొచ్చి చూస్తే బిగ్ షాక్.. ఏమైందంటే..?

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టికి చెందిన ముంబైలోని బాస్టియన్ రెస్టారెంట్ లో దొంగతనం జరిగింది. ఇందులోభాగంగా రూ.80 లక్షల విలువైన కార్ దొంగతనం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 

పూర్తివివరాల్లోకి వెళితే రుహాన్ ఖాన్ అనే వ్యక్తి ముంబైలోని బాంద్రాలో నివాసం ఉంటున్నాడు. రుహాన్ ఖాన్ కన్స్ట్రక్షన్ కి సంబందించిన వ్యాపారాలు చేసేవాడు.  ఆదివారం (అక్టోబర్ 27) తన స్నేహితులతో కలసి పార్టీ చేసుకోవడానికి బాస్టియన్ రెస్టారెంట్ కి వెళ్ళాడు. ఈ క్రమంలో రాత్రి సమయంలో తన కారుని బాస్టియన్ రెస్టారెంట్ పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి లోపలోకి వెళ్ళాడు. 

పార్టీ అనంతరం తిరిగివచ్చి చూడగా పార్కింగ్ స్థలంలో తన కారు కనిపించలేదు. దీంతో సెక్యూరిటీ ని అడగ్గా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో రుహన్ ఖాన్ వెంటనే శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేశాడు.  దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణ ప్రారంభించారు. 

ఇందులోభాగంగా దొంగతనానికి గురైన కారు ఖరీదు దాదాపుగా రూ.80 లక్షల విలువ ఉంటుందని పోలీసులు కనుగొన్నారు. రుహన్ ఖాన్ రెస్టారెంట్ లోపలోకి వెళ్లిన సమయంలో ఇద్దరు వ్యక్తులు మరో కారులో వచ్చి రుహన్ ఖాన్ కారుని దొంగలించినట్లు సీసీ కెమెరాల ద్వారా  పోలీసులు గుర్తించారు. దీంతో దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అధునాతన టెక్నాలజీ, కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఫీచర్లు కలిగి ఉన్నప్పటికి దొంగలు అతితెలివిగా కారుని దొంగలించారు.