లుపిన్‌‌ నుంచి ఈ ఏడాది మొదటి బయోసిమిలర్‌‌

లుపిన్‌‌ నుంచి ఈ ఏడాది మొదటి బయోసిమిలర్‌‌

న్యూఢిల్లీ : ఫార్మాస్యూటికల్‌‌ కంపెనీ లుపిన్‌‌ ఈ ఏడాదిలో తన మొదటి బయోసిమిలర్‌‌ ప్రొడక్ట్‌‌ను అమెరికాలో ప్రవేశపెట్టాలనుకుం టోంది. అలాగే తన తొలి ఇన్హలేషన్‌‌ ప్రొడక్ట్‌‌ను కమర్షియలైజ్‌‌ చేయాలని భావిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ప్రొడక్ట్స్‌‌ లాంఛ్‌‌ వృద్ధికి దోహదపడతాయని యాన్యువల్‌‌ రిపోర్టులో సీఈఓ వినితా గుప్తా, మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌ నీలేష్‌‌ గుప్తాలు తెలిపారు. 2020 సంవత్సరం లుపిన్‌‌కు ప్రత్యేకమైనదని, ఎందుకంటే మొదటి బయోసిమిలర్‌‌ను మార్కెట్లోకి తేనున్నామని చెప్పారు. అమెరికా జెనిరిక్‌‌ బిజినెస్‌‌లో వృద్ధిని కొనసాగిస్తామని, ఇంజెక్టబుల్స్‌‌ పోర్ట్‌‌ఫోలియోను అక్కడ ప్రవేశపెడతామని పేర్కొన్నారు. యూఎస్‌‌లో సోలోసెక్‌‌ బ్రాండ్‌‌, యూరప్‌‌లో నామస్క్‌‌లా, జపాన్‌‌లో బిప్రెస్సో బ్రాండ్‌‌లు పటిష్టం చేస్తున్నామని, దాంతో స్థిరమైన వృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారానే మంచి భవిష్యత్‌‌పై ఆశావహంగా ఉన్నామని తెలిపారు. ఫస్ట్‌‌ బయోసిమిలర్‌‌ ఎట్‌‌నార్సెప్ట్‌‌కు జపాన్‌‌లో అనుమతి వచ్చిందని, యూరప్‌‌ నుంచి అనుమతి రావాల్సి ఉందని వెల్లడించారు. కిందటేడాది అమెరికా మార్కెట్లో మొత్తం 22 కొత్త ప్రొడక్ట్స్‌‌ ప్రవేశపెట్టినట్లు యాన్యువల్‌‌ రిపోర్టు తెలిపింది. 157 ఏఎన్‌‌డీఏలు పెండింగ్‌‌లో ఉన్నాయని, 52 బిలియన్‌‌ డాలర్ల విలువైన మార్కెట్‌‌ ఉన్న ఔషధాలు తమ పైప్‌‌లైన్‌‌లో ఉన్నాయని వివరించింది. కిందటేడాది కొన్ని విజయాలు చూశామని, నియంత్రణా పరమైన సవాళ్లనూ ఎదుర్కొన్నామని