Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక  ఈ రాశుల వారు కోటీశ్వరులే...

100 సంవత్సరాల తర్వాత తొలిసారిగా హోలీ రోజు చంద్రగ్రహణం.. ఈ  రాశుల వారికి మహారాజయోగం ప్రారంభం..కోటీశ్వరులు అవకుండా ఎవరూ ఆపలేరు..
ఈ ఏడాది హోలీ రోజు పౌర్ణమి నాడు ( మార్చి 25)  చంద్రగ్రహణం రానుంది. ఈ గ్రహణం దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతోంది. ఈ సందర్బంగా పలు రాశుల వారికి శుభ, అశుభ ఫలితాలు లభించనున్నాయి. మీరు కనుక కింద పేర్కొన్న  రాశుల్లో ఉన్నట్లయితే ఇది మీకు శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే హోలీ పండగ ఈ రాశుల జీవితాల్లో రంగులు నింపనుంది. మీరు  ఆ రాశుల్లో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.

 హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజున హోలీ వేడుకలను జరుపుకుంటారు. ఈసారి మార్చి 25వ తేదీ సోమవారం నాడు ఈ సంబురాలను జరుపుకోనున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, హోలీ పండుగ రోజునే కన్యరాశిలో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ సమయంలో మీన రాశిలో సూర్యుడు, రాహువు, కుంభంలో శుక్రుడు, కుజుడు, శని ఉంటారు. అయితే 100 సంవత్సరాల హోలీ రోజున వచ్చిన ఈ చంద్ర గ్రహణం సమయంలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు లభించనున్నాయి. 

మేష రాశి: ఈ రాశి వారికి కొత్త ఏడాది 2024లో మొదటి చంద్ర గ్రహణం కారణంగా ఆర్థిక పరంగా మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు పురోగతి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. మీకు ఆకస్మిక దనలాభం ఉంటుంది. పూర్వీకులకు మంచి ఆస్తి లభిస్తుంది. చాలా కాలంగా మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి వస్తాయి. ఈ కాలంలో మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది.

మిధున రాశి:  ఈ రాశి వారికి మొదటి చంద్ర గ్రహణం సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.  మీరు పెండింగులో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం కలదు.  మానసిక ప్రశాంతత లభిస్తుంది.. మీ ఆరోగ్యం బాగుంటుంది.  మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, విశ్వాసం పెరుగుతుంది.  వైవాహిక జీవితంలో సమయం అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.

సింహ రాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం...  ఈ రాశి వారు హోలీ రోజున చంద్ర గ్రహణం కారణంగా అనేక ప్రయోజనాలు పొందొచ్చు. మీరు వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. మీ డబ్బులను తెలివిగా ఖర్చు చేయడంతో... చాలా డబ్బును ఆదా చేస్తారు. పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో పెట్టిన పెట్టుబడి వల్ల అనేక లాభాలొస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. 

తులారాశి: ఈ రాశి వారికి హోలీ వేళ చంద్ర గ్రహణం కారణంగా శుభ ఫలితాలొస్తాయి. సమాజంలో  గౌరవం పెరుగుతుంది. భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  పాత ఆస్తులను విక్రయించడం ద్వారా ఆర్థిక లాభాలొస్తాయి . మీ కెరీర్‌లో శుభవార్తలు అందుకుంటారు, విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.  ఉద్యోగ, వ్యాపారాలలో సంతృప్తిని పొందుతారు, డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు.  రాజకీయ రంగంలో పనిచేసేవారు గుడ్ న్యూస్ వింటారు.

మకర రాశి:ఈ రాశి వారికి హోలీ వేళ చంద్ర గ్రహణం ఏర్పడటంతో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వివిధ రంగాలలో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గొప్ప విజయం లభిస్తుంది.  మీ తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది

కుంభ రాశి: చంద్రగ్రహణం తరువాత, కుంభరాశి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారు విశేష విజయాన్ని పొందుతారు. కొన్ని శుభకార్యాలు లేదా శుభ కార్యాలు ఇంట్లో పూర్తవుతాయి . ఈ కాలంలో విలాసవంతమైన జీవితం గడుపుతారు.  రియల్ ఎస్టేట్ రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగంలో ఉన్నవారికి ఉచ్ఛస్థితి ప్రారంభం కానుంది. అంతేకాదు వీరు పట్టిందల్ల బంగారం కానుంది. దీంతో పాటు వీరు ఆర్థిక రంగంలోకూడా నిలదొక్కుకునే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారు లాటరీ వంటి వాటిలో విజయం సాధించవచ్చు.