Astrology: నిద్రపోయే ముందు.. లేచిన తరువాత..ఏ దేవుడికి దండం పెడితే అదృష్టం కలుగుతుంది..!

రోజూ లేస్తూనే చాలా మంది .. దేవుడా నాకు ఈ రోజు కలసి రావాలి.. నా జీవితం చాలా ప్రశాంతంగా ఉండాలి..  నా సమస్యలు తీరాలి.. అంటూ తనకున్న కోరికలు తీరాలని నిద్ర లేవగానే దేవుడికి దండం పెట్టుకుంటారు.  కొంతమంది అరచేతులు చూసుకుని.. భూమికి నమస్కారంచేస్తారు.   అయితే రోజూ రాత్రి పడుకునేముందు.. నిద్ర లేచిన తరువాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ అదృష్టం కలసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గరి నుండి పడుకొనేంత వరకు జనాలు హడావిడిగా గడుపుతారు.   ప్రస్తుతం జనాల జీవితం .. ఉరుకుల పరుగుల మీద ఆధారపడి ఉంది. నిద్ర లేస్తూనే ఆ పని చేయాలి...అంటూ హడావిడిగా గడుపుతారు.  ఏదో శాస్త్రానికి దేవుడికి ఒకదండం పెట్టి  వారి పనుల్లో నిమగ్నమవుతారు. అయితే జీవితం సాఫీగా ... ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా సాగాలంటే ఆధ్యాత్మికంగా కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

ప్రతి రోజు నిద్రించేటప్పుడు శివనామస్మరణ చేయాలని సూచిస్తున్నారు. ఓం నమ:శివాయ: నమ: అనే మంత్రాన్ని జపించడం వలన ఆరోజు ఎన్ని కష్టాలు పడినా.. ఎన్ని ఇబ్బందులు పడినా హాయిగా నిద్రపడుతుంది.  అలాగే ఉదయాన్నే లేవగానే శ్రీహరి.. శ్రీహరి..శ్రీహరి,. అని మూడు సార్లు విష్ణు నామాన్ని జపించాలని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఇలా చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. 

  • నిద్ర లేచేటప్పుడు  ముందుగా కనురెప్పలను చేతి వేళ్లతో తుడుచుకొని.. నిదానంగా కళ్లు తెరిచి.. మీ అర చేతులను .. ఆ తరువాత దేవుడి పటం వైపు చూడండి.   ఇక నిద్ర పోయేటప్పుడు మీ పక్కనే ఆవు నెయ్యిని ఒక చిన్న గిన్నెలో ఉంచుకోండి.  లేవగానే ఆవు నెయ్యిను అద్దాని  బొట్టు పెట్టి.. ఆ అద్దంలో మీ ముఖం చూడంది.  అంతేకాని నేరుగా అద్దాన్ని చూడవద్దని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
  • నిద్రలేచిన తరువాత విష్ణునామాన్ని జపించిన తరువాత  రెండు నిమిషాలపాటు వ్యాయామం చేయాలి.  బొటన వేళ్లపై నిలబడి.. రెండు చేతులను పైకి చాపి దండం పెడుతూ ఉండండి.  ఈ విధంగా చేయడం వలన దైవికంగా మీకు కొంత శక్తి వస్తుందని పండితులు చెబుతున్నారు.   
  • ఆ తరువాత కాలకృత్యాల అనంతరం.. మీ ఇంట్లో దేవుడి మందిరం దగ్గర రెండు అగర్ బత్తీలు వెలిగించి .. సమయాన్ని బట్టి ప్రార్థన చేసి అనంతరం మీ పనులు చూసుకోండి.
  • బయటకు వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడు.. ఇంటి సింహద్వారం దగ్గర గడపకు నమస్కారం చేయండి. 
  • వారానికి ఒక రోజు సెలవు రోజు మీకు దగ్గరలోని దేవాలయానికి వెళ్లండి