IPL Retention 2025: మెగా ఆక్షన్‌లోకి రాహుల్.. పూరన్‌కు లక్నో రూ 21 కోట్లు

ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ కు ముందు లక్నో సూపర్ జయింట్స్ జట్టు తమ రిటైన్ చేసుకునే ప్లేయర్లను ప్రకటించింది. వెస్టిండీస్ విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్ టాప్ లో ఉన్నాడు. అతనికి రూ. 21 కోట్లు ఇచ్చి మొదటి రిటైన్ ప్లేయర్ గా తీసుకున్నారు. పూరన్ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్ లో చెలరేగి ఆడుతున్నాడు. లీగ్ ఏదైనా విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఐపీఎల్ లో కూడా ఇంటి చేత్తో మ్యాచ్ లు గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. 

2024 ఐపీఎల్ లో రాహుల్ గైర్హాజరీలో ఈ విండీస్ బ్యాటర్ కొన్ని మ్యాచ్ లకు కెప్టెన్సీ చేశాడు. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ తో పాటు రవి బిష్ణోయ్ లు తర్వాత రిటైన్ ప్లేయర్లగా లక్నో తీసుకుంది. మయాంక్ యాదవ్ కు రూ. 11 కోట్లు.. రవి బిష్ణోయ్ రూ. 11 కోట్లు ఇచ్చారు. వీరిద్దరితో పాటు  మొహ్సిన్ ఖాన్ రూ.4 కోట్లు.. ఆయుష్ బడోనీలను రూ.4 కోట్లు ఇచ్చి అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా రిటైన్ చేసుకుంది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినీస్ కు నిరాశ తప్పలేదు.

ALSO READ | ఐపీఎల్ రిటెన్షన్ ఫుల్ లిస్ట్ రిలీజ్: 10 జట్లు రిటైన్ చేసుకున్నఆటగాళ్ల పూర్తి జాబితా ఇదే

మూడేళ్ళుగా లక్నో జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ పై లక్నో యాజమాన్యం ఆసక్తి చూపించలేదు. దీంతో అతను మెగా ఆక్షన్ లోకి రానున్నాడు. రాహుల్ విషయంలో లక్నో అసంతృప్తిగా ఉన్నట్టు  తెలుస్తుంది. అతని స్ట్రైక్ రేట్ చాలా  తక్కువగా ఉండడమే దీనికి కారణం. మొత్తం రూ. 69 కోట్లు పెట్టి లక్నో ఐదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. దీంతో వీరు రూ. 51 కోట్లతో మెగా ఆక్షన్ లోకి వెళ్లనున్నారు.