దేశంలో ఇదే ఫస్ట్
న్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) కన్‌స్ట్రక్షన్ కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా దేశంలో తొలి 3డీ ప్రింటెడ్ గ్రౌండ్ ప్లస్ ఒక ఫ్లోర్(G+1) బిల్డింగ్‌ను ఏర్పాటు చేసింది. కంపెనీ 3డీ ప్రింటెడ్ బిల్డింగ్ 700 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో కాంచీపురంలో నిర్మించింది. సొంత కాంక్రీట్ మిక్స్‌తో డెవలప్ చేసింది. దేశంలో దొరికే రెగ్యులర్‌గా వాడే కన్‌స్ట్రక్షన్ మెటీరియల్‌నే ఈ బిల్డింగ్ కట్టడానికి వాడామని తెలిపింది. హౌసింగ్ ఫర్ ఆల్ ప్రోగ్రామ్ కింద 2022 నాటికి 6 కోట్ల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంత పెద్ద హౌసింగ్ ప్రాజెక్ట్ టార్గెట్‌ను చేరుకోవడానికి త్రీడీ టెక్నాలజీ ద్వారా ఎల్ అండ్ టీ తన వంతు సేవలందిస్తోంది.
