Good Food : క్యాబేజీ తింటే కొన్ని క్యాన్సర్లు రావు.. శెనగలు తింటే బోలెడు విటమిన్లు వస్తాయి..!

బరువు పెరగడం ఈరోజుల్లో చాలా కామన్ ప్రాబ్లమ్. బరువు పెరిగిన వాళ్లు దాన్ని తగ్గించుకోవడం కోసం రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. అయితే బరువు తగ్గాలంటే వ్యాయామంతో పాటు తినే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. కొవ్వులేని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అవేంటంటే.. కొవ్వు తక్కువగా ఉండే ఫుడ్స్ లో క్యాబేజీ ఒకటి. ఉడికించిన క్యాబేజీలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది.

తరచూ క్యాబేజీ తినడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ చేరవు. కొన్నిరకాల క్యాన్సర్ల ప్రమాదమూ తగ్గుతుంది. అంతేకాదు క్యాబేజీ రక్తాన్ని శుద్ధిచేసి, కొలెస్ట్రాల్ను కూడా అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గించుకునే వాళ్లు తీసుకోవాల్సిన మరో సూపర్ ఫుడ్ మొలకెత్తిన గింజలు. మొలకెత్తిన పెసలు, శెనగలు వంటి వాటిల్లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది.

ALSO READ : శరీరంలో రక్తం పెరగాలంటే ఈ టిప్స్ పాటించండి

వాటిలో అన్నిరకాల విటమిన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, ఇనుము, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఓట్స్, గుడ్లు, సిట్రస్ ఫూట్స్, చేపల్లో కూడా ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఉడికించిన ఆలుగడ్డల్లో కూడా కొవ్వుశాతం తక్కువే అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్లు వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే మంచిది.

== V6 వెలుగు లైఫ్