ప్రేమికులు లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడలో జరిగింది. గన్నవరం మండలం తెలప్రోలుకు చెందిన నాగగౌతమి, గుడివాడకు చెందిన లోకేష్‌లు కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ కలిసి నిన్న రాత్రి విజయవాడ గాంధీనగర్‌లోని జగపతి లాడ్జీలో రూం నెంబర్ 303లో దిగారు. అయితే వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదో లేక ఇంకా ఏదైనా సమస్య ఉందో తెలియదు కానీ వారిరివురూ తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. అది గమనించిన లాడ్జీ సిబ్బంది తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే గౌతమి మృతి చెందింది. లోకేష్ అపస్మారక స్థితిలో ఉండగా, లాడ్జీ సిబ్బంది వెంటనే అతన్ని జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. గౌతమి తేలప్రోలులో ఉన్న ఉషా రామా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తుంది. కేసు నమోదు చేసిన గాంధీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోకేష్ కోలుకుంటేగాని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియవు.
For More News..
