మతమార్పిడి పెళ్లి అంటే చెప్పుతో కొట్టండి : బీజేపీ ఎమ్మెల్యే

మతమార్పిడి పెళ్లి అంటే చెప్పుతో కొట్టండి : బీజేపీ ఎమ్మెల్యే

మత మార్పిడి పెళ్లికి పాల్పడే వారిని చెప్పులు, రాడ్ లతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎమ్మెల్యే. ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్, మధ్యప్రదేశ్ సీఎం  శివరాజ్ సింగ్ చౌహాన్ ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా చట్టాన్ని అమలు చేస్తామని అన్నారు.

తాజాగా ఉత్తర్ ప్రదేశ్ సార్ధన అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సంగీత్ సామ్ మాట్లాడుతూ..లవ్ జీహాద్  అనేది ఉగ్రవాదంలో ఓ భాగమన్నారు. ఈ తరహా ఉగ్రవాదం దేశంలో యాక్టీవ్ గా ఉందని, దీనిపై ప్రతీ ఒక్కరు స్పందించాలన్నారు.

కేరళ హైకోర్ట్ తో పాటు కేరళ సీఎం లు సైతం లవ్ జీహాద్ తరుచుగా వినబడుతుందన్న వ్యాఖ్యల్ని గుర్తు చేసిన ఆయన.. లవ్ జీహాద్ అంటే హుక్కులు, రాడ్లు, చెప్పులతో బుద్ధి చెప్పాలని ఉత్తర్ ప్రదేశ్ ఎమ్మెల్యే సంగీత్ సామ్ ప్రజల్ని కోరారు.