ఢిల్లీలో లవ్ జిహాద్ కలకలం.. పారిపోయిన జంట

ఢిల్లీలో లవ్ జిహాద్ కలకలం.. పారిపోయిన జంట
లవ్ జిహాద్ పేరుతో బలవంతపు మత మార్పిడులకు ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. లేటెస్టుగా ఇంటి మరో ఘటన బయట పడింది. దేశ రాజధాని ఢిల్లీలో 21 ఏళ్ల యువతి..జావెద్ అనే వ్యక్తి కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇందులో భాగంగానే…ఇంటినుంచి పారిపోయి జావెద్ ను మ్యారేజ్ చేసుకుంది. దీనికి 10 మంది కుటుంబ సభ్యులు సహకరించినట్లు సమాచారం. ఈ విషయం కుటుంబ సభ్యుల ద్వారా  తెలుసుకున్న పోలీసులు….వారిని అరెస్టు చేయడానికి వెళ్లారు. అందులో ఆరుగురిని కస్టడీలోకి తీసుకోగా మిగిలిన ఐదుగురు పారిపోయారు. వీరిలో యువతి, జావెద్ తో పాటు ఆయన కుటుంబానికి చెందిన వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.. వీరిని జలేసార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పరారీలో ఉన్న వారి పట్టించన వారికి 25,000 రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. యువతి తండ్రి ఇప్పటికే కేసు నమోదు చేయగా FIR ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. జావేద్ కు సంబందించిన లాయర్ కు కూడా నోటీసులు జారీ చేశారు పోలీసులు.