లారీ బీభత్సం..తల్లీకూతురు మృతి..తండ్రీబిడ్డకు తీవ్రగాయాలు

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. అదుపుతప్పిన లారీ బీభత్సం సృష్టించింది. ఒక ఆటోను రెండు బైకులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీకూతురు  అక్కడికక్కడే మృతిచెందగా.. తండ్రీ, మరో కూతురు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు.

రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ జాతీయ రహదారిపై ఆదివారం (ఆగస్టు 25,2024) ఈ ప్రమాదం జరిగింది. షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ.. అదుపుతప్పి రెండు బైకులను, ఒక ఆటోను ఢీకొట్టింది.దీంతో బైకుపై వెళ్తున్న తల్లీకూతురు స్పాట్ లోనే చనిపోయారు. అదే బైక్ పై వెళ్తున్న తండ్రీ, మరో కూతురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇదే లారీ కొత్తూరు వద్ద మరో బైకును ఢీకొట్టగా బైకుపై వెళ్తున్న వారికి గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నందునే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.