శ్రీకృష్ణుడు ఎక్కడ చదువుకున్నాడో తెలుసా...

ప్రస్తుతం విద్యార్థులకు...నిరుద్యోగులకు కాంపిటేటివ్​ యుగం నడుస్తోంది. ఎవరికైనా మంచిర్యాంక్​...మంచి ఉద్యోగం వచ్చిదంటే..అతను ఎక్కడ చదివాడు.. ఎలా చదివాడు..వాళ్లకు పాఠాలు చెప్పిందెవరు.. వాళ్లు చదివిన కోచింగ్​ సెంటర్లు ఎక్కడున్నాయి...ఇలా ఆరాతీస్తాం..ఇదేమన  నైజం.. అయితే ద్వాపర యుగంలో  భగవాన్​ శ్రీకృష్ణుడు ఎంతగా రాణించాడో అందరకు తెలిసిందే.  ఆ కాలంలో ఉండే ఆశ్రమాల్లో గురువుల దగ్గర విద్యను అభ్యసించేవారు. త్రేతా యుగంలో శ్రీరామచంద్రుడు వశిష్ఠమహర్షి దగ్గర విద్యనభ్యసిస్తే... ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి అవతారంలో ఏ ఆశ్రమంలో విద్యనభ్యసించాడో తెలుసుకుందాం. . . .

శ్రీకృష్ణుడు.. అంటే చిలిపిచేష్ఠల గలవాడని పురాణాలు చెబుతున్నాయి.  ఆయనే పాండవులకు విజయానికి కారణమయ్యాడు.కారాగాకంలో  దేవకీ...వశువులకు జన్మించిన శ్రీకృష్ణపరమాత్ముడు.... నంద, యశోదల దగ్గర పెరుగుతాడు. ఆయన కారణజన్ముడు కావడంతో...పసి తనం నుంచే చిత్రవిచిత్రాల విన్యాసాలను ఎంతో అనుభవమున్నవాడిగా ప్రవర్తించేవాడు. అయితే విద్యాభ్యాసం వయస్సువచ్చే సరికి నంద,యశోధలు.. మహర్షి సాందీపుని ఆశ్రమంలో చేర్పించారని పురాణాల ద్వారాతెలుస్తోంది.

మహర్షి సాందీపుని ఆశ్రమం  మధ్యప్రదేశ్​లో ఉజ్జయినిలో ఉంది.  శ్రీకృష్ణుడు, అతని స్నేహితుడు సుదాముడు, సోదరుడు బలరాముడు కూడా విద్యను అభ్యసించిన ఆశ్రమం ఇదే. ఇక్కడే శ్రీ కృష్ణుడు 64 రోజులలో 16 కళలు, 64 శాస్త్రాల జ్ఞానాన్ని సంపాదించాడు.  అయితే శ్రీకృష్ణుడు కూడా విష్ణుమూర్తి అవతారమే కదా..ఆయన చిలిపి చేష్ఠలను..శ్రీ కృష్ణుని లీలలను..చూసేందుకు కైలాసం నుంచి పరమేశ్వరుడు ఒకానొక సమయంలో వచ్చాడట. అప్పుడు శివుడు కూడా బాల్య రూపాన్ని ధరించి.. ఆయనతో సంచరించాడట. శివుడితో పాటు ఆయన వాహనం నందీశ్వరుడు కూడా వచ్చాడు. శ్రీకృష్ణుడు.. శివుడు వస్తుండగా కూర్చొని ఉన్న నందీశ్వరుడు లేచి నిల్చున్నాడు. ఈ విషయాన్ని గమనించిన శ్రీకృష్ణుడు... నందీశ్వరుడిని.. ఎప్పుడు ఇలానే నిలబడి ఉండి ఇక్కడకు వచ్చే శివ భక్తులను ఆశీర్వదించమని కోరాడని శివ పురాణంలో ఉంది. సరే నందీశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ శివుడు కూడా ఉండాడు కదా..!