లోక్ తాంత్రిక్ జనతాదళ్ (ఎల్జేడీ) పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి రాజ్ రావు బుధవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సుభాషిణి రాజ్ రావు ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. సుభాషిణి బీహార్ ఎన్నికల్లో బీహార్గంజ్ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి మహాఘట్ బంధన్ గా ఏర్పాడి రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వంలో ఎన్నికల బరిలో దిగాయి. శరద్ యాదవ్ కుమార్తె కాంగ్రెస్ పార్టీలో చేరి బీహార్ ఎన్నికల బరిలోకి దిగనుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
