CM జగన్ విద్యార్థుల నోటికాడి కూడు తీసేశారు : లోకేశ్

CM జగన్ విద్యార్థుల నోటికాడి కూడు తీసేశారు : లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ లో ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో … 2 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం దూరమైందంటూ ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అవసరమా అని జగన్ చేసిన వ్యాఖ్యలనే ఆదేశాలుగా… అధికారులు విద్యార్థులకు పథకం ఆపేశారంటూ కథనాలు వచ్చాయి. దీనిపై నారాలోకేశ్ సోషల్ మీడియాలో స్పందించారు.

“జగన్.. తన రాజభవనం ముందు 1.3 కి.మీ. రోడ్డు వెయ్యడానికి రూ.5 కోట్లు, టాయిలెట్స్ కట్టడానికి రూ.30 లక్షలు, బ్యారికేడ్లు పెట్టడానికి రూ.75 లక్షలు, హెలిప్యాడ్ కు రూ.1.89 కోట్లు… ఇలా విచ్చలవిడిగా జగన్ ఖర్చు పెడుతున్నారు. కానీ పేద ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనవసరం అనడం దారుణం. పొదుపు చేసుకోవాలంటే 2 లక్షల మంది పేద విద్యార్థుల నోటి దగ్గర ముద్దనే తీసెయ్యాలా?” అని ప్రశ్నించారు లోకేశ్.