పార్లమెంటులో వాయిదాల పర్వం

పార్లమెంటులో వాయిదాల పర్వం

పార్లమెంట్ లో విపక్షాలు నిరసనలు కంటిన్యూ చేశాయి. సభలు ప్రారంభమైనప్పటి నుంచి నినాదాలు, ఆందోళనలు చేపడుతున్నాయి. సభా కార్యకలాపాలు సజావుగా సాగడం లేదు. సభలను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. వాయిదా అనంతరం సభలు ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నారు. ఉభయసభల్లో వరుసగా మూడో రోజు ఆందోళన చేపట్టాయి విపక్షాలు. దీంతో ఉభయసభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. జీఎస్టీ పెరుగుదల, ద్రవ్యోల్బణం, డాలరుతో రూపాయి విలువ పడిపోవడం వంటి అంశాలు చర్చించాలని లోక్ సభలో ఆందోళన చేపట్టాయి ప్రతిపక్షాలు. ప్లకార్డులతో స్పీకర్ ఛైర్ దగ్గర ప్రదర్శన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని నినాదాలతో అడ్డుకున్నారు. విపక్ష సభ్యులు ఎంతకూ తగ్గకపోవడంతో.. స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకున్నారు. నినాదాల్లో పాల్గొన్న వారంతా చర్చల్లో పాల్గొనాలని సూచించారు. 

మధ్యాహ్నం 2 వరకు సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అనంతరం ప్రతిపక్షాలు ప్ల కార్డులతో నినాదాలు చేశాయి. జవాబ్ దో... జవాబ్ దో అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ రాజ్యసభలోనూ ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. నినాదాలతో రాజ్యసభను హోరెత్తించారు. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. అనంతరం ఉభయసభల్లో ప్రతిపక్షాలు ఆందోళనలను ప్రారంభించారు. దీంతో సభలను గురువారానికి వాయిదా వేశారు. సమావేశాలు ప్రారంభం కాకముందు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల పెరుగుదలపై నిరసన చేపట్టారు కాంగ్రెస్ ఎంపీలు. పార్లమెంటు ఆవరణలో బైఠాయించి తమ నిరసన తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టారు. ధరలు తగ్గించాలని బ్యానర్లు ప్రదర్శించారు. కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ఖర్గేతో కలిసి టీఆర్ఎస్ ఎంపీ కేకే కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.