లఖీంపూర్ ఖేరీ కేసు.. లోక్ సభ వాయిదా

లఖీంపూర్ ఖేరీ కేసు.. లోక్ సభ వాయిదా

లోక్ సభ వాయిదా పడింది. సభను మధ్యాహ్నం రెండుగంటల వరకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా . లఖింపూర్ ఖేరీ కేసు ఘటనపై సిట్ ఇచ్చిన దర్యాప్తు నివేదికపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మరోవైపు లఖింపూర్ ఖేరీ కేసు ఘటనపై విచారణ జరిపిన సిట్ మంగళవారం తన దర్యాప్తు నివేదికను అందించింది. . ఆ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించింది. ఈ హింసాకాండ ప్రణాళికాబద్దమైన కుట్ర సిట్‌ వెల్లడించింది. అయితే.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా త‌న‌యుడు అశిశ్ మిశ్రాపై ఇప్పటికే న‌మోదైన‌ అభియోగాల‌ను మార్చాల‌ంటూ ఈ కేసు విచార‌ణ జ‌రుపుతున్న న్యాయ‌మూర్తికి సిట్ లేఖ రాసింది. 

ఇవికూడా చదవండి:

వీడియో: పల్లకి తెగి కిందపడిన కొత్త జంట

తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీ