న్యూఢిల్లీ: లాక్ డౌన్ ప్రభావంతో ప్రయాణికులు లేక మరో పది రైళ్లను రద్దు చేసింది భారతీయ రైల్వేశాఖ. కరోనా లాక్ డౌన్ తోపాటు తౌక్టే తుపాను కూడా తోడు అయింది. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు చేస్తుండడంతో దాదాపు అన్ని దూర ప్రాంత రైళ్లు నామమాత్ర ప్రయాణికులతో నడుస్తున్నాయి. లాక్ డౌన్ కర్ఫ్యూ ఆంక్షల నేపధ్యంలో ప్రయాణికులు పూర్తిగా తగ్గిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరో 10 రైళ్లు రద్దు చేస్తున్నట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే ప్రకటించింది. ఈనెల 19 నుంచి 10 రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
జోథ్ పూర్ - ఇండోర్, శ్రీ గంగా నగర్ -అంబాలా, జోధ్ పూర్ -అంబాలా, జోధ్ పూర్ -ఢిల్లీ సరై రోహిల్లా, జోధ్ పూర్ -బిలాడా, జోధ్ పూర్ -బార్మెర్ తదితర రైళ్లు ఈనెల 19 నుంచి అందుబాటులో ఉండవని రైల్వేశాఖ ప్రకటించింది. ఇవేకాకుండా అజ్మీర్ - అమృత్ సర్ మధ్య నడిచే రైలు నాలుగు ట్రిప్పులను తగ్గించేశారు.
