గ్లోబల్‌‌ మార్కెట్‌కు లోకల్ ప్రొడక్ట్‌‌‌‌లు!

గ్లోబల్‌‌ మార్కెట్‌కు లోకల్ ప్రొడక్ట్‌‌‌‌లు!

హైదరాబాద్‌‌ హలీం, నిర్మల్‌‌ పెయింటింగ్స్‌‌, బొమ్మలు, పోచంపల్లి చీరలు..ఈ ప్రొడక్ట్‌‌లను చూసినప్పుడు ఇవి ఎక్కడ తయారయ్యాయో కూడా గుర్తొస్తుంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఈ ప్రొడక్ట్‌‌లను వాటి ప్లేస్‌ను బట్టి గుర్తుపడతారు. ‘ఫలానా చోట తయారయ్యే చీర చాలా బాగుంటుంది. తీసుకుంటే అక్కడే తీసుకోవాలి’ అంటూ చాలా మంది అంటుండడం చూస్తుంటం. దీనికి కారణం జియోగ్రాఫికల్‌‌ ఇండికేషన్‌‌ (జీఐ). ఏదైనా ప్రొడక్ట్‌‌ యునిక్‌‌గా ఉండి, కేవలం కొన్ని ప్లేస్‌‌లలోనే తయారయితే వాటికి జీఐ ఇస్తారు. 

బిజినెస్‌‌‌‌‌‌‌‌డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: జియోగ్రాఫికల్ ఇండికేషన్‌‌‌‌ (జీవీ) ట్యాగ్‌‌‌‌ వచ్చాక లోకల్ ప్రొడక్ట్‌‌‌‌లు గ్లోబల్‌‌‌‌ స్థాయికి చేరుకోవడం చూశాం. ‘టీ తాగితే డార్జిలింగ్‌‌‌‌ టీనే తాగాలి. చీర కొంటే బెనారస్‌‌‌‌ చీరనే కొనాలి’ ఇలాంటి మాటలు చాలా సార్లు విని ఉంటాం. ముందు ఈ ప్రొడక్ట్‌‌‌‌ల గురించి ఎవరికీ తెలియదు. జియో ట్యాగ్ వచ్చాక, దేశ, విదేశాల్లో ఈ ప్రొడక్ట్‌‌‌‌లు ఎక్కువగా ఫేమస్ అయ్యాయి. వీటి ఎగుమతులు పెరగడానికి జీఐ కారణమవుతోంది. ప్రభుత్వం కూడా వీలయినన్ని ప్రొడక్ట్‌‌‌‌లకు జీఐ ట్యాగ్ పొందాలని చూస్తోంది. ఉదాహరణకు  కిందటేడాది బాస్మతీ రైస్‌‌‌‌‌‌‌‌కు యురోపియన్ యూనియన్‌‌‌‌‌‌‌‌(ఈయూ) లో జీఐ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ను పొందేందుకు ప్రభుత్వం కష్టపడింది. బాస్మతి రైస్‌‌‌‌‌‌‌‌ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పండుతోందంటూ ఈయూకు ఇండియా అప్లికేషన్‌‌‌‌‌‌‌‌ పెట్టుకుంది. బాస్మతి రైస్‌‌‌‌‌‌‌‌కు చెందిన హిస్టోరికల్‌‌‌‌‌‌‌‌, ట్రెడీషనల్‌‌‌‌‌‌‌‌, కల్చరల్‌‌‌‌‌‌‌‌ విషయాలను ఈ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌లో తమ దగ్గర కూడా బాస్మతి రైస్‌‌‌‌‌‌‌‌ పండుతుందని, ఇండియాకు బాస్మతి రైస్ జీఐ ఇస్తే తమ రైతులు నష్టపోతారని పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. ఇది నిజమే, ఒక వేళ బాస్మతి రైస్‌‌‌‌‌‌‌‌కు ఇండియా జీఐ ట్యాగ్ వస్తే, బయ్యర్లు పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ కంటే ఇండియాలో బాస్మతి కొనడానికి ఇష్టపడతారు. ఎందుకంటే జీఐ ట్యాగ్ ఒక ట్రేడ్‌‌‌‌‌‌‌‌మార్క్‌‌‌‌‌‌‌‌లా పనిచేస్తుంది. బయ్యర్లు కూడా జీఐ ట్యాగ్ ఉన్న ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు ఒరిజనల్‌‌‌‌‌‌‌‌ అని భావిస్తారు. దీంతో ఇండియా బాస్మతి రైస్‌‌‌‌‌‌‌‌ జీఐ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ను పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో పంచుకోవాల్సి వచ్చింది.

ఇండియాలో 370 జీఐ ప్రొడక్ట్‌‌లు..
ప్రస్తుతం  దేశంలోని 370 ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లకు జీఐ ట్యాగ్ ఉంది. మొదట డార్జిలింగ్ టీ కోసం జీఐ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ను ప్రభుత్వం పొందగలిగింది.  జీఐ ట్యాగ్‌‌‌‌‌‌‌‌తో లోకల్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను  గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా మార్కెటింగ్ చేసుకోవచ్చని కేపీఎంజీ అడ్వైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిలశ్చల్‌‌‌‌‌‌‌‌ మిశ్రా పేర్కొన్నారు. ‘మన దగ్గర ఉన్న కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి అందరికి తెలియడానికి జీఐ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ ఉపయోగపడుతుంది. కానీ, దీనిపై చాలా మందికి తక్కువ అవగాహన ఉంది’ అని తెలిపారు. జీఐ ట్యాగ్‌‌‌‌‌‌‌‌తో లోకల్‌‌‌‌‌‌‌‌గా దొరికే యునిక్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు ఫేమస్ అవుతాయని తెలిపారు. ‘ఇండియాలో యునిక్‌‌‌‌‌‌‌‌గా దొరికే క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌లు, పంటలు ఉన్నాయి. వందల కొద్దీ యునిక్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను మనం ప్రొడ్యూస్‌ చేస్తున్నాం.  కానీ, ఇప్పటి వరకు కేవలం 370 ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లకే జీఐ ట్యాగ్ ఉంది’ అని అన్నారు.  లోకల్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ల ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ను పెంచడంలో జీఐ సాయపడుతుందని చెప్పారు. 

జీఐ ట్యాగ్‌‌‌‌‌‌‌‌తో లాభం..
బాస్మతి రైస్‌‌‌‌‌‌‌‌ను  ఎగుమతి చేయడం ద్వారా టన్నుపై 868 డాలర్లను పొందొచ్చు. అదే సాధారణ రైస్‌‌‌‌‌‌‌‌ను తీసుకుంటే టన్నుపై 360–390 డాలర్లు మాత్రమే చెల్లిస్తున్నారు. బాస్మతి రైస్‌‌‌‌‌‌‌‌కు జీఐ ట్యాగ్ ఉండడంతో ప్రస్తుతం ఈయూకి చేస్తున్న రైస్‌‌‌‌‌‌‌‌ ఎగుమతులు 250 మిలియన్ డాలర్ల నుంచి 500 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. దీంతో పాటు జీఐ ట్యాగ్ ఉంటే  ఇండియాలో పండిన రైస్‌‌‌‌‌‌‌‌ను గుర్తించడానికి వీలుంటుంది. దీంతో ఎగుమతులు పెరుగుతాయి. డార్జిలింగ్ టీ గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా ఫేమస్ అయ్యింది. ఇక్కడి టీ రైతులకు మేలు జరిగింది. ప్రస్తుతం 370 ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లకు జీఐ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ను పొందాం. ఇందులో 50 ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లు ట్రైబల్ ఏరియాలో దొరికేవే. మరో  50 ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను గుర్తించి ప్రమోట్ చేయాలని కూడా ప్రభుత్వం చూస్తోంది. మన దగ్గర పండే 97 పంటలకు జీఐ గుర్తింపు ఉంది. లోకల్‌‌‌‌‌‌‌‌గా దొరికే యునిక్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌లను గుర్తించి గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా ప్రమోట్‌‌‌‌‌‌‌‌ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. దీని కోసం వన్ డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌ వన్ ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌ (ఓడీఓపీ) విధానాన్ని తీసుకురావాలని ప్లాన్స్‌‌‌‌‌‌‌‌ వేస్తోంది. 

తెలంగాణ జీఐ ట్యాగ్ ప్రొడక్ట్‌‌లు..
జీఐ ట్యాగ్‌‌                     ఏరియా    
ఆదిలాబాద్‌‌ డోక్రా          ఆదిలాబాద్
బంగినపల్లి మామిడి      ఖమ్మం, మహబూబ్‌‌నగర్‌‌‌‌, మెదక్‌‌, ఆదిలాబాద్‌‌
చేర్యాల్‌ పెయింటింగ్స్‌‌    చేర్యాల్‌, సిద్దిపేట్‌‌
గద్వాల్‌‌ చీరలు             గద్వాల్‌‌
హైదరాబాద్‌‌ హలీం         హైదరాబాద్‌‌
నారాయణ్​పేట్‌‌ హ్యండ్లూమ్‌‌  చీరలు    నారాయణ్‌‌పేట్‌‌
నిర్మల్‌‌ ఫర్నిచర్‌‌, పెయింటింగ్‌‌, బొమ్మలు, క్రాఫ్ట్స్‌‌‌‌    నిర్మల్‌‌
పెంబర్తి మెటల్ క్రాఫ్ట్స్‌‌    పెంబర్తి, జనగాం
పోచంపల్లి ఇక్కత్‌‌    నల్గొండ, వరంగల్‌‌
సిద్దిపేట గొల్లబామ    సిద్దిపేట
సిల్వర్‌‌‌‌పై డిజైన్స్‌‌    కరీంనగర్‌‌‌‌
వరంగల్ దురీస్‌‌    వరంగల్‌‌
పుట్టపాక తెలియా రుమాల్‌‌    పుట్టపాక, నల్గొండ

వివిధ రాష్ట్రాల్లోని జీఐ ప్రొడక్ట్‌‌‌‌లు..
1)    జమ్మూ అండ్ కాశ్మీర్‌‌‌‌.. పాశ్మినా, చేతితో చేసే కార్పెట్‌‌, పేపిర్ మాషే, చెక్కపై చేతితో చేసే డిజైన్స్‌‌
2)    హిమాచల్ ప్రదేశ్‌‌.. కాంగ్రా పెయింటింగ్స్‌‌, కులూ శాలువ, చంబా రుమాల్‌‌
3)    సిక్కిం.. పెద్దగాఉండే ఏలకులు
4) అరుణాచల్ ప్రదేశ్‌‌.. అరుణాచల్ ఆరెంజ్‌‌
5) నాగాలాండ్‌‌.. నాగా మిర్చి, చాక్సేసాంగ్‌‌ శాలువ, నాగా ట్రీ టమోటో
6) అస్సాం.. ముగా సిల్క్‌‌, జోహా రైస్‌‌, తేజ్‌‌పుర్‌‌‌‌ లిట్చి ఫ్రూట్‌‌
7)    మణిపుర్‌‌‌‌.. షాపీ లాన్ఫీ, వాంగ్ఖే ఫీ, కచాయ్ నిమ్మ
8)    మిజోరాం.. మిజో చిల్లి
9)    త్రిపుర.. త్రిపుర క్వీన్‌‌ పైనాపిల్‌‌
10)    వెస్ట్‌‌బెంగాల్‌‌.. డార్జిలింగ్ టీ, శాంతినికేతన్‌‌, లెదర్ గూడ్స్‌‌
11)    మేఘాలయా.. మెమోంగ్‌‌ నారంగ్‌‌, ఖాసి మాండరిన్‌‌
12) బిహార్.. మధువని పెయింటింగ్స్‌‌, భాగల్‌‌పుర్‌‌‌‌ సిల్క్‌‌, సిక్కి గ్రాస్‌‌ వర్క్‌‌
13)    ఉత్తరప్రదేశ్‌‌.. వారణాసి గ్లాస్‌‌ బీడ్స్‌‌, లక్నో చికన్‌‌ క్రాఫ్ట్‌‌, బనారస్ చీరలు
14)    రాజస్థాన్‌‌.. నీలం కలర్‌‌‌‌లోని కుండలు
15)    గుజరాత్‌‌.. కచ్ ఎంబ్రాయిడర్‌‌‌‌, పాతన్ పటోలా
16)    మధ్యప్రదేశ్‌‌.. లెదర్ బొమ్మలు, చందేరి ఫ్యాబ్రిక్‌‌
17)    చత్తీస్‌‌గఢ్.. బస్తర్‌‌‌‌ డోక్ర, బస్తర్‌‌‌‌ చెక్క పని, బస్తర్‌‌‌‌ ఐరన్ క్రాఫ్ట్‌‌
18)    ఒడిస్సా.. కోణార్క్‌‌ రాతి బొమ్మ, గంజం కెవడా పువ్వు
19    మహారాష్ట్ర.. నాసిక్‌‌ వ్యాలి వైన్‌‌, మహాబలేశ్వరం స్ట్రాబరీ, వర్లీ పెయింటింగ్‌‌
20)    గోవా.. ఫెని (ఆల్కహాల్‌‌)
21)    కర్నాటక.. చెన్నపట్న బొమ్మలు, మైసూర్‌‌‌‌ శాండల్ సోప్‌‌
22)    ఆంధ్రప్రదేశ్‌‌.. తిరుపతి లడ్డు, కొండపల్లి బొమ్మలు
23)    తమిళనాడు.. కాంచిపురం సిల్క్‌‌, కొయంబత్తూర్‌‌‌‌ వెట్ గ్రైండర్‌‌‌‌, తంజావూర్ పెయింటింగ్స్‌‌
24)    కేరళ.. పాలక్కాడ్​ మట్టా రైస్‌‌, బలరాంపురం చీరలు