IPL 2025 Mega Auction: మెగా ఆక్షన్ టైమింగ్‌లో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?

ఐపీఎల్ మెగా ఆక్షన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మెగా యాక్షన్ జరగనుంది. 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. వేలం అబాడి అల్ జోహార్ అరేనా వేదికగా జరగనుండగా.. ఫ్రాంచైజీల యజమానులు, అధికారులు హోటల్ షాంగ్రి-లాలో బస చేయనున్నారు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగబోయే మెగా వేలం కోసం ఆటగాళ్ల జాబితాను శుక్రవారం (నవంబర్ 15) ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం 574 మంది ఆటగాళ్లు వేలానికి వెళ్లనున్నారు. భారత కాలమాన ప్రకారం  మధ్యాహ్నం 1 గంటలకు వేలం ప్రారంభమవుతాయని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్  ధృవీకరించింది. ఈ  జాబితా ప్రకారం 574 మంది ఆటగాళ్లు వేలానికి వెళ్లనున్నారు. 

574 మంది ఆటగాళ్లలో 366 మంది భారతీయులు కాగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు. ముగ్గురు అసోసియేట్ ఆటగాళ్లు ఉన్నారు. 366 మంది భారత ఆటగాళ్లలో 318 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక 208 మంది విదేశీ ఆటగాళ్లలో 12 మంది అన్‌క్యాప్‌డ్ కేటగిరిలో ఉన్నారు. 81 మంది ఆటగాళ్లు రూ. 2 కోట్ల అత్యధిక ధరతో వేలంలో పాల్గొననున్నారు.

Also Read : మ్యాచ్ మన చేతుల్లోనే

అరగంట ఆలస్యంగానే
 
ముందుగా అనుకున్న సమయం ప్రకారం కంటే ఐపీఎల్ వేలం అరగంట ఆలస్యంగా ప్రారంభం కానుంది. దీని ప్రకారం మూడు గంటలకు ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ మెగా ఆక్షన్ 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. బ్రాడ్ కాస్టర్స్ బీసీసీఐని ప్రారంభ సమయాన్ని మార్చాలని అభ్యర్ధించినట్టు సమాచారం. 

లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే..?

టీవీల్లో ఈ మెగా ఆక్షన్ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. మొబైల్స్ లో జియో సినిమాలో లైవ్ చూడొచ్చు.