టూల్స్ గాడ్జెట్స్..మ్యూజిక్ ప్రొజెక్టర్

మ్యూజిక్ ప్రొజెక్టర్

ఈ మధ్య పిల్లల్ని నిద్రపుచ్చడం తల్లులకు పెద్ద టాస్క్ అయిపోయింది. పసివాళ్లు నిద్రపోవాలంటే జోలపాటలకు బదులు స్మార్ట్​ ఫోన్​లు, టీవీల్లో రైమ్స్ పెట్టాల్సిందే. అది ఓకే కానీ, స్క్రీన్ చూడడం వాళ్ల కళ్లకు మంచిది కాదు. మరెలా? మ్యూజిక్ ప్రొజెక్టర్​ని ట్రై చేస్తే బెటర్. పిల్లలు పడుకునే ఉయ్యాలకు మ్యూజిక్​ ప్రొటెక్టర్​ని అటాచ్ చేయొచ్చు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ గాడ్జెట్​ రెండు విధాలుగా పనిచేస్తుంది. దీన్ని ఆన్ చేయగానే ప్రొజెక్టర్​లో బొమ్మలు కనిపిస్తాయి. దాంతోపాటు మ్యూజిక్ ప్లే అవుతుంటుంది. ప్రొజెక్టర్​ మీద వచ్చే బొమ్మలు చూస్తూ.. మ్యూజిక్​ వింటూ నిద్రలోకి జారుకుంటారు. ఈ గాడ్జెట్ కిడ్స్​ని అట్రాక్ట్ చేసేలా కలర్​ఫుల్​గా, స్టార్​ ఆకారంలో తయారుచేసింది సుదౌషి బ్రాండ్. ఈ డివైజ్​కి మ్యూజిక్, లైట్స్​ ఆపరేట్ చేసేందుకు రెండు బటన్స్ ఉంటాయి. ఇది నాన్ టాక్సిక్, హై క్వాలిటీతో తయారైంది. 

ధర : రూ. 699/–

బేబీ హెడ్ ప్రొటెక్టర్

అప్పుడప్పుడే కూర్చునేందుకు ట్రై చేస్తున్న పిల్లల్ని చాలా కనిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే  కూర్చుని ఆడుకునేటప్పుడు తెలియకుండానే బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడిపోతుంటారు. కాబట్టి వాళ్లకు దెబ్బ తగలకుండా ప్రొటెక్ట్ చేయాలంటే.. వెనక మెత్తటి ప్రొటెక్టర్ ఉండాలి. ఆ ప్రొటెక్టర్​ ఇది. మెత్తటి దిండులా ఉండి, పిల్లలకు నచ్చేలా రంగుల బొమ్మలతో దీన్ని సిన్​లార్క్ బ్రాండ్ అనే కంపెనీ తయారుచేసింది. దీన్ని వాడడం పెద్ద కష్టమేమీ కాదు.. బ్యాగ్​లా భుజాలకు తగిలించాలంతే. పిల్లల వయసు బట్టి షోల్డర్ స్ట్రాప్​ని అడ్జస్ట్ చేయొచ్చు. ఇంట్లో, బయట ఎక్కడైనా సరే పిల్లలకి దెబ్బ తగలకుండా కాపాడుతుంది ఇది. వీపుకి వేయడం అంటే బరువు ఉంటుందేమో అనే సంశయం అక్కర్లేదు. ఇది లైట్​ వెయిట్ ఉంటుంది. 

ధర : రూ.379/–

ట్రాలీ కిచెన్ సెట్

చిన్నపిల్లలకోసం ప్లాస్టిక్, స్టీల్, మట్టి వంటి మెటీరియల్​తో తయారైన కిచెన్ సెట్​ ఇస్తుంటారు. కానీ, వాటిని జాగ్రత్త చేయడమే ఇబ్బంది. ఎందుకంటే చిన్నపిల్లల ఆట వస్తువులు ఉన్న చోట ఉండవు. ఎక్కడో ఒక చోట మిస్ అవుతుంటాయి. కాబట్టి ఈసారి కిచెన్ సెట్​ కొనేటప్పుడు వాటిని జాగ్రత్తగా దాచేలా తీసుకోవాలంటే అర్బన్ టాయ్స్ బ్రాండ్ తయారుచేసిన ట్రాలీ కిచెన్​ సెట్ మంచి చాయిస్​ అని చెప్పొచ్చు. ఇందులో స్టవ్, పాన్, వంట పాత్రలు, ప్లేట్లు, కప్పులు, స్పూన్లు, ఫోర్కులు, వెజిటబుల్స్, సాస్​వంటి అనేక ఇతర కిచెన్ ఐటమ్స్ ఉంటాయి. కిచెన్ టూల్స్ అన్నీ ఇందులో చక్కగా సర్దుకుని, సూట్​కేసులా పట్టుకెళ్లొచ్చు. ట్రాలీ కాబట్టి మోసుకెళ్లే పనిలేదు. ఈజీగా లాక్కుంటూ వెళ్లొచ్చు. రియలిస్టిక్ లైట్, సౌండ్ ఎఫెక్ట్స్ వంటి ఫీచర్స్ ఉంటాయి దీనికి. అంటే నిజంగా వంట చేస్తుంటే ఎలాంటి సౌండ్స్​ వస్తాయో అలాంటివి వినపడతాయన్నమాట. దీనివల్ల పిల్లల్లో క్రియేటివ్​ స్కిల్స్ పెరుగుతాయి. షేరింగ్, కలిసి పని చేసుకోవడం వంటివి అలవడతాయి. ఈ ట్రాలీ కిచెన్ సెట్ రకరకాల రంగుల్లో ఉంది. 

ధర : రూ.1,289/–

పాటీ సీట్

పిల్లలకి డైపర్లు కొంతకాలమే వాడగలరు. కానీ, ఆ తర్వాత నుంచి బాత్​రూమ్ అలవాటు చేయాల్సిందే. వాళ్లకోసమే ప్రత్యేకంగా తయారుచేసిన ఐటమ్​ పాటీ సీట్. పాటీ సీట్​ వాడడం వల్ల పిల్లలు ఒంటరిగా టాయిలెట్​కి వెళ్లేలా ట్రైనింగ్ ఇవ్వొచ్చు. పైగా పిల్లలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. పాటీ సీట్​ తీసి టాయిలెట్ సీట్​ మీద పెట్టి కూడా వాడొచ్చు. ఎత్తు ఎక్కువ అనిపిస్తే పాటీ చెయిర్​ని కాళ్ల కింద సపోర్ట్​గా పెట్టుకోవచ్చు. దీన్ని ఏ వయసు పిల్లలైనా వాడొచ్చు. ఈ పాటీ సీట్​ని స్టార్ అండ్ డైసీ అనే కంపెనీ తయారుచేసింది. దీని బరువు 1.5 కిలోలు ఉంటుంది. 

ధర : రూ. 1,299/–