కరువు కాలంలోనూ .. బాలానగర్ లో రూ.2 కోట్ల గోవా మద్యం పట్టివేత

గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న  మద్యం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బాలానగర్‌లో పట్టుబడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.  స్వాధీనం చేసుకున్న మద్యం ధర సుమారు రూ.2 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.  పట్టుకున్న మందు రాయల్ క్వీన్ 1200 కాటన్​లు, రాయల్ బ్లూ 800 కాటాలు ఉన్నాయని పోలీసు అధికారులు తెలిపారు.  

కాటన్​లో 48 సీసాల ఉన్నాయని మహబూబ్​నగర్​ జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. తదుపరి విచారణ నిమిత్తం వాహనంతో పాటు స్వాధీనం చేసుకున్న బాటిళ్లను తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు అప్పగించారు.   పోలింగ్​కు 2 రోజుల ముందు పెద్ద మొత్తంలో మద్యం పట్టుబడటం చర్చకు దారితీస్తోంది.  ఈ మద్యాన్ని ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది.