ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లిక్కర్​సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.100 కోట్లపైనే

  •  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లిక్కర్​సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.100 కోట్లపైనే 
  • డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 31, న్యూ ఇయర్ సందర్భంగా భారీగా పెరిగిన అమ్మకాలు 
  •  వారం ముందు నుంచే లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొని నిల్వచేసిన వైన్స్ ఓనర్లు 
  • నిరుడితో పోలిస్తే 20శాతం పెరిగినట్లు ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారుల అంచనా

 
కరీంనగర్, వెలుగు: న్యూ ఇయర్  వేడుకల సందర్భంగా ఉమ్మడి జిల్లాలో లిక్కర్ భారీగా అమ్ముడైంది. డిసెంబర్ చివరి  వారం రోజుల్లో డిపోల నుంచి  రూ.100 కోట్లపైన విలువైన లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైన్ షాపులకు సరఫరా కాగా.. చివరి 31 డిసెంబర్ రాత్రి వరకు లిక్కర్ లో చాలా వరకు సేల్ అయినట్లు తెలిసింది. న్యూఇయర్ వేడుకలకు లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువ ఉంటాయన్న ఉద్దేశంతో షాపు ఓనర్లు వారం ముందు నుంచే భారీగా లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొని నిల్వ చేసుకున్నారు. దీని విలువ కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కలిపి రూ.100 కోట్లు దాటినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

వేల కేసుల బీర్లు, బాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కొద్ది లిక్కర్ తాగేశారు.. 

థర్టీ ఫస్ట్ దావత్ ల సందర్భంగా చాలా మంది లిక్కర్, బీర్ ఫుల్లుగా తాగేశారు. కరీంనగర్ జిల్లాలో డిసెంబర్ 31న ఒక్క రోజే 6,785 లిక్కర్ బాక్స్ లు, 8,124 బీర్ కేసులతోపాటు ఇతర మద్యం కలిపి రూ.7.52 కోట్ల విలువైన సరుకు వైన్స్ షాపులకు చేరింది. అలాగే జగిత్యాల జిల్లాలో 3,457 లిక్కర్ బాక్స్ లు, 8,156 బీర్ కేసులతోపాటు ఇతర మద్యం కలిపి రూ.4.42 కోట్ల సరుకు షాపులకు చేరింది. పెద్దపల్లి జిల్లాలో రూ.6 కోట్ల మద్యం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.5 కోట్ల మద్యం వైన్స్ షాపులకు దిగుమతి అయింది. 

ఇలా 29 డిసెంబర్ ఆదివారం మినహా గత వారం రోజుల్లో రోజుకు రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల లిక్కర్ డిపోల నుంచి వైన్స్ షాపులకు సరఫరా అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా కరీంనగర్ జిల్లాలో 31న నైట్ సుమారు రూ.30 కోట్ల మద్యం తాగగా, జగిత్యాల జిల్లాలో సుమారు రూ.20 కోట్లు, సిరిసిల్ల జిల్లాలో సుమారు రూ.25 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో రూ.28 కోట్ల మేర లిక్కర్ తాగినట్లు ఎక్సైజ్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. నిరుడితో పోలిస్తే 20 శాతం మేర లిక్కర్ అమ్మకాలు పెరిగినట్లు పేర్కొన్నారు.