వికారాబాద్‌లో ఉరికించినట్టే.. హుజూరాబాద్‌లోనూ ఉరికిస్తరు: పాడి కౌశిక్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతులు తిరగబడి కలెక్టర్‌ను ఉరికించారని, దళితబంధు ఇవ్వక పోతే హుజూరాబాద్ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితులే వస్తాయని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. తన పోరాటం పోలీసులపై కాదని, తన పోరాటం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపైనేనని అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తా అని అంటే ఆగమేఘాల మీద రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారని తెలిపారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మూసీ నిర్వాసితుల వద్ద పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు.