రీజినల్​ రింగ్​ రైల్ కోసం ​లైడార్​ సర్వే

 

  • కొడంగల్​కు ప్రత్యేక హెలికాప్టర్​

కొడంగల్​, వెలుగు: కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్​ రింగ్​ రోడ్డు(ఆర్​ఆర్​ఆర్​) పనులు వేగంగా సాగుతున్నాయి. దీనికి సమాంతరంగా  నిర్మించే రీజినల్​ రింగ్​ రైల్​ ప్రాజెక్ట్​ కోసం లైడార్​ సర్వే ప్రారంభమైంది. లైడార్​ సర్వే  కోసం స్పెషల్​ హెలికాప్టర్​ మంగళవారం కొడంగల్​ చేరింది. మూడు రోజులు సర్వే నిర్వహించనున్నట్లు ఆర్వీ అసోసియేట్స్​ ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు.  సుమారు 564 కిలోమీటర్ల పరిధిలో రీజినల్​ రింగ్​ రైల్​ ప్రాజెక్ట్​ నిర్మాణం కానుంది. వికారాబాద్​, సంగారెడ్డి, మెదక్​, సిద్దిపేట్​, గజ్వేల్​, భువనగిరి, యాదాద్రి, చిట్యాల, నారాయణపూర్​, షాద్​నగర్​, షాబాద్​ను కలుపుతూ ఈ ప్రాజెక్ట్​ వెళ్తుందని సమాచారం.