తన పాలసీహోల్డర్లకు రిస్క్ కవర్ను కొనసాగించాలనే ఆలోచనతో ఎల్ఐసీ రద్దయిన పాలసీలను పునరుద్ధరించడానికి ‘స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఐదేళ్లుగా ప్రీమియం చెల్లించని పాలసీలను కూడా పునరుద్ధరించుకోవచ్చు. కొన్ని పాలసీలకే ఈ మినహాయింపు ఉంటుందని, ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయని ఎల్ఐసీ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 22 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కొన్ని పాలసీలకు లేటుఫీజులో మినహాయింపు కూడా ఇస్తారు. మిగతా వివరాల కోసం ఏజెంట్ల కానీ లోకల్ ఎల్ఐసీ ఆఫీసులను గానీ సంప్రదించాలి.
