T10 League: RCB ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్త.. 15 బంతుల్లో లివింగ్ స్టోన్ హాఫ్ సెంచరీ

ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రూ. 8.75 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఆర్సీబీ జట్టులోకి ఈ ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ చేరడంతో అతనికి ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. మరోవైపు బెంగళూరు ఫ్యాన్స్ కూడా ఈ ఇంగ్లాండ్ ఆటగాడిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. లివింగ్ స్టోన్  ఆర్సీబీ జట్టుకు ఒక మ్యాచ్ ఆడకుండానే ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాడు. 

ప్రస్తుతం జరుగుతున్న అబుదాబి టీ10 లీగ్ 15 బంతుల్లో అజేయంగా 50 పరుగులు చేసి తమ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఇంగ్లీష్ బ్యాటర్ ఇన్నింగ్స్ లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. లివింగ్ స్టోన్ ధాటికి ఢిల్లీ బుల్స్‌పై బంగ్లా టైగర్స్ 123 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేజ్ చేసింది. లివింగ్‌స్టోన్  ఇన్నింగ్స్ తో ఆర్సీబీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బ్యాటింగ్ తో పాటు స్పిన్  బౌలింగ్ కూడా చేయగల ఈ ఇంగ్లాండ్ ఆటగాడు ఆర్సీబీ తరపున ఎలా ఆడతాడో చూడాలి. 

Also Read:-ఆసీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గడ్డపై అఖండ విజయం 295 రన్స్ తేడాతో టీమిండియా రికార్డు

2024 ఐపీఎల్ సీజన్ లో లివింగ్ స్టోన్ పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. ఆడింది కొన్ని మ్యాచ్ లే అయినా బ్యాటింగ్ లో నిరాశ పరిచాడు. అయితే బౌలింగ్ లో మాత్రం అద్భుతంగా రాణించాడు. ఇటీవలే ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ లో మెరుపులు మెరిపించి సూపర్ ఫా,ఎం లో ఉన్నాడు. ఆర్సీబీ జట్టుకు అత్యుత్తమంగా ఆడతానని.. టైటిల్ తీసుకొని రావడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చాడు.