బట్టలు శుభ్రం చేసుకోవడానికి ఎల్‌‌‌‌జీ స్టైలర్ లాంచ్‌‌‌‌‌‌‌‌

బట్టలు శుభ్రం చేసుకోవడానికి ఎల్‌‌‌‌జీ స్టైలర్ లాంచ్‌‌‌‌‌‌‌‌
ధర రూ. 1.60 లక్షలు హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బట్టలు శుభ్రం చేసుకోవడానికి ‘స్టైలర్’ పేరుతో ఓ ప్రొడక్ట్‌‌‌‌ను ఎల్‌‌‌‌జీ గురువారం లాంచ్ చేసింది. స్టైలర్‌‌‌‌‌‌‌‌ ద్వారా బట్టలను శానిటైజ్‌‌‌‌ , స్టీమ్‌‌‌‌ చేసుకోవచ్చు.  దీని ధర రూ. 1.60 లక్షలు. థింక్‌‌‌‌ టెక్నాలజీతో వచ్చిన ఈ ప్రొడక్ట్‌‌‌‌ను వైఫై ద్వారా ఆపరేట్‌‌‌‌ చేసుకోవచ్చు. క్లాత్స్‌‌‌‌ ఫ్యాబ్రిక్‌‌‌‌ బట్టి టైమ్‌‌‌‌, ఎనర్జీ కన్జంప్షన్‌‌‌‌ను యూజర్లు కంట్రోల్‌‌‌‌ చేయొచ్చని ఎల్‌‌‌‌జీ ఓ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌లో పేర్కొంది. స్టైలర్‌‌‌‌‌‌‌‌లో నాలుగు హ్యాంగర్లుంటాయి. బట్టలను ఇందులో పెట్టాక  క్లాత్‌‌‌‌ టైప్‌‌‌‌ను సెలెక్ట్‌‌‌‌ చేసుకోవాలి. కాటన్‌‌‌‌, లెనిన్‌‌‌‌, ఊలు, సిల్క్‌‌‌‌, పాలిస్టర్‌‌‌‌‌‌‌‌ వంటి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.  రిఫ్రెష్‌‌‌‌, శానిటైజ్‌‌‌‌, డ్రై వంటివి ఈ స్టైలర్‌‌‌‌‌‌‌‌ ద్వారా చేసుకోవచ్చు. స్టైలర్‌‌‌‌‌‌‌‌లో కేవలం స్టీమ్‌‌‌‌ టెక్నాలజీని మాత్రమే వాడామని, మనుషులకు, పెట్స్‌‌‌‌కు హానీ చేసే ఎటువంటి కెమికల్స్‌‌‌‌, డిటర్జెంట్లను వాడలేదని కంపెనీ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులలో కస్టమర్లు హెల్త్‌‌‌‌, హైజీన్‌‌‌‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఎల్‌‌‌‌జీ వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ విజయ్‌‌‌‌ బాబు అన్నారు.