పీల్చే గాలిని శుభ్రం చేసే మాస్క్ లు : త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న మాస్క్ లు

పీల్చే గాలిని శుభ్రం చేసే మాస్క్ లు : త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్న మాస్క్ లు

గాలిని ఫ్యూరిఫైయ‌ర్ చేసేలా ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ సంస్థ ఎల్జీ స్మార్ట్ మాస్క్ ను త‌యారు చేసింది. బ్యాట‌రీతో న‌డిచే ఈ మాస్క్ ను ధ‌రించ‌డం వ‌ల్ల మ‌నం పీల్చే గాలి ఫ్యూరిఫైయ‌ర్ అవుతుంద‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. అయితే దీని ధ‌ర ఎంత‌..? మార్కెట్ లోకి ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుంది..? త‌దిత‌ర విష‌యాల్ని సెప్టెంబ‌ర్ లో జ‌రిగే ఐఎఫ్ ఎ 2020 ప్ర‌ద‌ర్శ‌న త‌రువాత వివరాల్ని వెల్ల‌డిస్తామ‌ని చెప్పారు.

మాస్క్ లో ఫీచ‌ర్స్ ఇలా ఉన్నాయి.

ఎల్జీ త‌యారు చేసిన ఈ స్మార్ట్ మాస్క్ లో రెండు ఫ్యాన్లు, బ్యాట‌రీలు, రెస్పిరేట‌రీ సెన్సార్లు ఇమిడి ఉన్నాయి.

మాస్క్ ఎలా ప‌నిచేస్తుంది.

గాలిని శుద్ధి చేసేందుకు మాస్క్ లోప‌ల రెండు హెచ్ 13 హెఈపీఏ ఫిల్ట‌ర్లు ఉన్నాయి. గాలిని పీల్చిన‌ప్పుడు ఈ ఫిల్ట‌ర్ల సాయంతో మాస్క్ లోప‌ల ఉన్న ఫ్యాన్లు వాటంత‌టిక‌వే గాలిని ఫూరిఫైయ‌ర్ చేస్తాయి. క‌లుషిత‌మైన గాలిని ప‌క్క‌కు పంపించి, స్వ‌చ్ఛ‌మైన గాలిని అందిస్తాయి. బ్రీతింగ్ సెన్సార్లు మ‌నం పీల్చే గాలి హెచ్చు త‌గ్గుల్ని నియంత్రిస్తు అవ‌స‌ర‌మైన గాలిని అందిస్తుంద‌ని, మాస్క్ లో ఉన్న బ్యాట‌రీల‌కు ఛార్జింగ్ పెట్టడం వ‌ల్ల మోడ్‌లో 8 గంటలు, హై మోడ్‌లో రెండు గంటలు పనిచేస్తుంద‌ని ఎల్జీ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు.