న్యూ ఇయర్ ఆఫర్ : ఫోన్ కొంటే ఎల్ఈడీ టీవీ ఫ్రీ

న్యూ ఇయర్ ఆఫర్ : ఫోన్ కొంటే ఎల్ఈడీ టీవీ ఫ్రీ

న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు పలు కంపెనీలు తమ ప్రాడక్ట్స్ ను అమ్మేందుకు  తెగ పోటీ పడుతుంటాయి. దీని కోసం వినియోగదారులకు  వివిధ రకాల ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి.

అలాగే ఓ కంపెనీ.. తమ సెల్ ఫోన్ కొంటే.. టీవీ ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. అంతటితో ఆగకుండా వన్ టైం ఫ్రీ సర్వీస్.. రీ ప్లేస్ మెంట్‌ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఎల్ జీ సంస్థ ఈ ఆఫర్ ను ప్రకటించింది.

ఇటీవల మార్కెట్లోకి విడుదలైన LG G8X పై ఎల్ జీ సంస్థ ఈ ఆఫర్ ప్రకటించింది.  రూ. 49,999 పెట్టి ఫోన్ కొంటే. 24 ఇంచుల LG LED TV ఫ్రీగా ఇస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు చెప్పారు.  డిసెంబర్ 25నుంచి జనవరి 15 జనవరి 2020 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.   ఆన్ లైన్,ఆఫ్ లైన్ రెండు విధాలుగా కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని,  LG G8X  స్మార్ట్ ఫోన్‌ను కొన్న తర్వాత జనవరి 15 తేదీలోపు.. LG వెబ్ సైట్‌లో పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ ఇస్తే చాలు టీవీ మీ ఇంటికే వచ్చేస్తుంది.