నియోజకవర్గ అభివృద్ధికి కలిసి పని చేద్దాం : ఎంపీ మల్లు రవి

వనపర్తి, వెలుగు : వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కలిసి పనిచేద్దామని నాగర్​కర్నూల్ ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. మంగళవారం ఎంపీ మల్లు రవి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీ వెళ్లి ఆయనను కలిశారు.

అనంతరం ఎంపీని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీగా మల్లు రవి కేంద్రంలో, రాష్ట్రంలో ఎమ్మెల్యేగా కలిసి పనిచేస్తూ వనపర్తి నియోజకవర్గాన్ని విద్య, వైద్యం, సాగునీటి రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ఇద్దరు నేతలు పేర్కొన్నారు.