టెర్రరిస్టులను అరికట్టేందుకు పోలీసులు, భద్రతా దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ(శనివారం) పుల్వామా జిల్లాలోని పాంపోర్ ద్రంగ్ బల్ లో పోలీసులు,భద్రతా దళాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్ లో లష్కరే తొయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖండే తోపాటు మరో ఉగ్రవాది హతమయ్యారు. పాంపోర్ లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఈ ఆ పరేషన్ మొదలు పెట్టారు. ఎన్ కౌంటర్ తర్వాత వారి దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది ఆగస్టులో కశ్మీర్ పోలీసులు విడుదల చేసిన టాప్10 టెర్రరిస్టుల లిస్టులో ఉమర్ ముస్తాక్ పేరు కూడా ఉంది. శ్రీనగర్ లో ఇద్దరు పోలీసులను హత్య చేసిన కేసులో ఇతను నిందితుడని పోలీసులు తెలిపారు.
