దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు

దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు

దేశంలో కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.  నిన్న రెండు లక్షలకు దిగువన కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో1,86,364 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు2,75,55,457 కు చేరాయి. ఇక నిన్న 3,660 మంది చనిపోవడంతో కోవిడ్ మరణాలు మొత్తం 3,18,895 కు చేరాయి.నిన్నమరో 2,59,459మంది డిశ్చార్జ్ కావడంతో మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,48,93,410 కి చేరింది. ఇంకా 23,43,152 ఆక్టివ్ కేసులున్నాయి.