శ్రీశైలం ఆలయ పూజారి ఇంట్లో చిరుత

  • పాతాళగంగ మార్గంలో సంచరించగా సీసీ కెమెరాలో రికార్డ్

శ్రీశైలం, వెలుగు : ఏపీలోని శ్రీశైలం పాతాళగంగ మార్గంలో ఆదివారం అర్ధరాత్రి చిరుతపులి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో శ్రీశైలం ఆలయ పూజారి సత్యనారాయణ ఇంట్లో చిరుత సంచరించింది. ఇంటి వెలుపల నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ విషయమై పూజారి ఫారెస్ట్​ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఇంటి పరిసరాలను పరిశీలించి వెళ్లారు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు రాత్రి పూట బయటకు రావొద్దని సూచించారు.