ఇండియాలోనే లెనోవో టాబ్లెట్ల తయారీ

ఇండియాలోనే  లెనోవో టాబ్లెట్ల  తయారీ
ల్యాప్ ట్యాప్ ల తయారీ పెంపు ఎడ్యుకేషన్ సెగ్మెంట్ నుంచి డిమాండ్ న్యూఢిల్లీ: పీసీ తయారీ కంపెనీ లెనోవో ఇండియాలో టాబ్లెట్లను తయారు చేయాలని చూస్తోంది. అలాగే ల్యాప్ ట్యాప్ మాన్యుఫాక్చరింగ్ ను పదింతలు పెంచాలనుకుంటోంది. పెద్ద సంస్థలు, ఎడ్యుకేషన్ సెగ్మెంట్ నుంచి డిమాండ్ పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25–30 శాతం గ్రోత్ వస్తుందని లెనోవో అంచనా వేస్తోంది. అయితే వచ్చే ఆర్థికసంవత్సరం డిమాండ్ తగ్గొచ్చని లెనోవో ఇండియా  సీఈవో, ఎండీ రాహుల్ అగర్వాల్ అంటున్నారు. కంపెనీ డబుల్ డిజిట్లలో పెరుగుతుందని, ఇదే ట్రెండ్ను మెయింటైన్ చేస్తుందని పేర్కొన్నారు. కన్జూమర్ మార్కెట్ 40 లక్షలుగా ఉంది. ఇది గత ఐదేళ్ల నుంచి ఫ్లాట్గానే ఉంది. కానీ కరోనా షాక్ తో ఇంటి నుంచే పనిచేయడం, ఆన్లైన్లో చదువుకోవడం ప్రారంభించారు. 2019లోనే లెనోవోకి ఈఎల్సీఓటీ నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్ వచ్చింది. ఈఎల్సీఓటీ తమిళనాడు ప్రభుత్వానికి, దాని స్కీమ్స్ కు ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సేవలందించడం కోసం పనిచేస్తోన్న నోడల్ ఏజెన్సీ. ఈఎల్సీఓటీ డీల్ ప్రకారం ఆ రాష్ట్రంలోని విద్యార్థులకు 15 లక్షల ల్యాప్ ట్యాప్ లను లెనోవా అందించాల్సి ఉంటుంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ ప్రకారం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో ఇండియన్  పీసీ మార్కెట్(డెస్క్ టాప్ లు, నోట్ బుక్స్, వర్క్ స్టేషన్స్) వార్షికంగా 9.2 శాతం పెరిగింది. అక్టోబర్–డిసెంబర్ కాలంలో లెనోవో కన్జూమర్ సెగ్మెంట్ లో 40 శాతం గ్రోత్ ను రికార్డు చేసింది. కాంపోనెంట్లు, ప్యానల్స్ విషయంలో ఇండస్ట్రీ సప్లయి షార్టేజ్ ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఇది ల్యాప్టాప్లపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ప్రస్తుతం నెలకొన్న ఫ్యానల్స్ షార్టేజ్ వచ్చే 3 నుంచి 6 నెలల వరకు ఉంటుందని తెలిపింది. బీటూబీ మార్కెట్ ప్రస్తుతం స్తబ్దుగా ఉందని, ఎకానమీ తిరిగి కోలుకున్నాక చాలా కంపెనీలు వాయిదా వేసుకున్న కొనుగోళ్లను చేపతాయని చెప్పింది. దీని కోసం కంపెనీ పుదుచ్చేరి ఫెసిలిటీలో ల్యాప్టాప్ మాన్యుఫాక్చరింగ్ సౌకర్యాన్ని కంపెనీ పదింతలు పెంచుతోంది. అదేవిధంగా ఇండియాలోనే టాబ్లెట్ల తయారీని ప్రారంభించాలని లెనోవో చూస్తోంది. 8 అంగుళాల స్క్రీన్ కే డిమాండ్… ‘టాబ్లెట్ల కోసం ఎక్కువగా మేము కమర్షియల్ వ్యాపారాలను ఫోకస్ చేశాం. ప్రస్తుతం మాకు 60–65 శాతం మార్కెట్ షేరు ఉంది’ అని రాహుల్ అగర్వాల్ చెప్పారు. తమ టాబ్లెట్లలో ఎక్కువగా రిటైల్ అవుట్లెట్ల ద్వారానే అమ్ముడుపోయాయని తెలిపారు. 8 అంగుళాల స్క్రీన్ సైజు ఉన్న పీసీలకు బాగా డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. చాలా మంది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటం, ఇంట్లోనే క్లాసెస్ వింటుడటంతో సేల్స్ తర్వాత సర్వీసులను కూడా లెనోవో అందిస్తోంది.