ఎంసీఎఫ్ లో మాల్యా వాటాల అమ్మకం

ఎంసీఎఫ్ లో మాల్యా వాటాల అమ్మకం

యూబీ గ్రూప్‌ నుంచి బకాయిల రికవరీలో భాగంగా మంగళూరు కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌(MCF)లో విజయ మాల్యాకు చెందిన 12 శాతం వాటాను బ్యాంకులు అమ్మేశాయి. షేర్లను స్టాక్‌ మార్కెట్లో అమ్మేశామని… వచ్చిన మొత్తాన్ని బకాయిల్లో జమ చేసుకుంటామని తెలిపాయి బ్యాంకులు. షేర్ల అమ్మకం ద్వారా చాలా తక్కువ మొత్తంలో బకాయిలు వచ్చాయని చెప్పాయి. మొత్తం రూ.9,200 కోట్లతో పోల్చితే ప్రస్తుతం వచ్చినవి అతి తక్కువన్నాయి. MCFలో మాల్యా వాటా అమ్మటంతో యూబీ గ్రూప్‌, ఎంసీఎఫ్‌ మధ్య పదేళ్ల కాల బంధానికి ముగింపు పలికినట్టయింది.1990 లో యూబీలోకి MCF గ్రూపు అడుగుపెట్టింది. ఎంసీఎఫ్‌ ప్రస్తుత ప్రమోటర్‌ అడ్వాన్టేజ్ గ్రూప్‌ కంపెనీలో క్రమంగా వాటాను పెంచుకుంటోంది. గురువారం సెషన్‌లో MCF షేర్లు 10 శాతం వరకు వృద్ధి చెందాయి.