చిన్న పరిశ్రమలకు అప్పులివ్వండి

చిన్న పరిశ్రమలకు అప్పులివ్వండి

ప్రైవేటు బ్యాంకులను కోరిన నిర్మలా సీతారామన్

ప్రైవేటు బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీ హెడ్ లతో మీటింగ్

న్యూఢిల్లీ: ఆత్మ నిర్బర భారత్ అభియాన్ లో భాగంగా ప్రకటించిన రూ.3 లక్షల కోట్ల ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీజీఎస్) కింద అప్పులివ్వాలని ప్రైవేటు బ్యాంకులను ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ప్రైవేటు బ్యాంకులతో సోమవారం జరిగిన మీటింగ్ లో ఆమె ఈవిధంగా పేర్కొన్నారు. కరోనా దెబ్బతో తీవ్రంగా నష్టపోయిన చిన్న పరిశ్రమల (ఎంఎస్ ఎంఈ)ను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఈ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ మీటింగ్ కు పెద్ద ఎన్ బీఎఫ్ సీ కంపెనీల సీఈఓలు కూడా హాజరయ్యారు. కరోనా నేపధ్యంలో మీటింగ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపారు. ఇండియన్ ఎంఎస్ఈలు కరోనా క్రైసిస్ ను తట్టుకొని నిలబడడానికి క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద వీరికి అదనంగా అప్పులివ్వాలని ఆర్ధిక మంత్రి సీతారామన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పేర్కొన్నారు. ఈ మీటింగ్ లో డిపార్టుమెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రెటరీ దెబాశిష్ పాండా కూడా పాల్గొన్నారని ఫైనాన్స్ మినిస్ట్రీ ట్విట్టర్ లో పేర్కొంది. జూన్ 11 నాటికి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంక్ లు  రూ.29,490.81 కోట్ల అప్పులను మంజూరు చేశాయి. ఇందులో రూ.14,690.84 కోట్లను ఇప్పటికే పంపిణీ చేశాయి

.

**EDS: TWITTER IMAGE POSTED BY @nsitharaman, THURSDAY, MAY 28, 2020** New Delhi: Union Finance Minister Nirmala Sitharaman chairs the 22nd Financial Stability and Development Council (FSDC) meeting through video conferencing, in New Delhi. Union Minister of State for Finance Anurag Thakur is also seen. (PTI Photo)(PTI28-05-2020_000200A)