ముంబై: ప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ గులాం ముస్తఫా ఖాన్ (89) అస్తమించారు. ముంబైలోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యారు. నర్సు వచ్చి సపర్యలు చేస్తుండగా ఒక్కసారిగా వాంతులు చేసుకుని కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన వైద్యులను పిలిపించేలోపు ఆయన తుదిశ్వాస విడిచారు. వయోభారంతో ఉన్న ఆయనకు వైద్యులు నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. నర్సులు దగ్గరుండి మసాజ్ వంటి సపర్యలు చేస్తున్నారు. దీని కోసం వైద్యుల పర్యవేక్షణలో నర్సులు ముస్తఫాఖాన్ ఇంట్లోనే 24 గంటలు ఉంటూ నిరంతరం చూసుకుంటున్నారు. ఇవాళ ఉదయం కూడా ఆయన చలాకీగా నే ఉన్నారని.. అయితే మధ్యాహ్నం 12.37 గంటల సమయంలో ఒక్కసారిగా వాంతి చేసుకుని తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. కళ్లు తేలవేస్తూ.. నెమ్మదిగా ఊపిరి తీసుకోవడం నర్సు గుర్తించి వెంటనే డాక్టర్లకు కబురు చేసిందని ఆయన కోడలు నమ్రతా గుప్తాఖాన్ చెబుతున్నారు. ఆయనకు ఇంకా 90 ఏళ్లు నిండలేదు. ఉత్తర్ ప్రదేశ్ లోని బదౌన్ లో 1931 మార్చి 3వ తేదీన ఆయన జన్మించారు. కొద్ది రోజుల్లో 90వ పడిలోకి ప్రవేశిస్తారు. మంచి చలాకీగానే ఉన్నారని.. 90వ జన్మదినం కూడా జరుపుకుంటారని ఆశించామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 2019లో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఎడమ చేయి పక్షవాతంతో పడిపోయినా కోలుకున్నారని వారు గుర్తు చేసుకుంటున్నారు. రామ్ పూర్ ఘరానాకు చెందిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ తో సత్కరించింది. సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు.ముంబైలోని శాంతాక్రూజ్ లో ఉన్న ఖబరస్తాన్ లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.
ముస్తఫాఖాన్ మృతికి ప్రధాని మోడీ సంతాపం
ప్రముఖ సంగీత సంగీత కళాకారుడు గులాం ముస్తఫాఖాన్ మృతి పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత దేశం ప్రముఖ సంగీత విద్వాంసుడిని కోల్పోవడం విషాదకరం అన్నారు. ఆయనతో సన్నిహితంగా గడిపిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్, ఏఆర్ రెహ్మాన్, విశాల్ దద్టాని, అంజాద్ అలీఖాన్ తదితరులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
ఆ యువకుడి ఆదాయం రోజుకు 9 లక్షలు… ఆ డబ్బుతో లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులు
కిడ్నాప్ కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. మాజీ మంత్రి అఖిలప్రియ చెప్పిన వివరాలే కీలకం?
జోరుగా రికార్డింగ్ డ్యాన్సులు.. అరెస్ట్ చేసిన పోలీసులు
