హైదరాబాద్, వెలుగు: జుట్టు రాలడం, చర్మం ముడతలు పడడం, గోర్లు పెలుసుబారడం వంటి సమస్యలకు పరిష్కారంగా ఫార్మా కంపెనీ లీ హెల్త్ ‘నేచురల్ కేర్’ పేరుతో ఓ మెడిసిన్‌ను లాంచ్ చేసింది. ఈ మెడిసిన్ క్యాప్సుల్స్‌ను ఫైటో న్యూట్రీయంట్స్, బయో న్యూట్రాసూటికల్స్‌తో తయారు చేశామని కంపెనీ పేర్కొంది. ఈ మెడిసిన్‌లో గుడ్డు పెంకు నుంచి తీసిన పొర, బయోటిన్, కెరాటిన్, స్పైరులినాతో పాటు ఉసిరి, ద్రాక్ష గింజలు, వెదురు నుంచి తీసిన సారం, ఎల్లాజిక్ యాసిడ్ వంటి ప్రొడక్ట్‌లను వాడారు. ఈ మెడిసిన్‌ను మందుల షాపుల్లో కొనుక్కోవచ్చు. అమెజాన్, లీ హెల్త్ డొమెయిన్ వెబ్ సైట్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు.
