పన్ను ఎగవేతకు పాల్పడిన చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు

పన్ను ఎగవేతకు పాల్పడిన చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు భారత్ తో తన కార్యకలాపాలు నిలిపివేయనుంది. ఇండోనేషియా, బంగ్లాదేశ్, నైజీరియాల్లో తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ లో కథనాలు వచ్చాయి. భారత్ దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలను ప్రోత్సహించేందుకు చైనా కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయంది. స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ప్రెజర్ ఎక్కువగా ఉంటుందంది. 

చైనా సంస్థ ఒప్పో ఈజిప్ట్ లో మానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఫోన్ల తయారీ ప్లాంటు కోసం సుమారు 20 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. దాంతో రాబోయే రోజుల్లో 900 ఉద్యోగాలు సృష్టించవచ్చన్నారు ఈజిప్ట్ ప్రభుత్వ ప్రతినిధులు.

గతేడాది డిసెంబర్ నెలలో ఆదాయపు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు షివోమీపై కేసు నమోదు చేశారు ఈడీ అధికారులు.  కంపెనీలకు అక్రమంగా నిధుల్ని మళ్లించిందనే ఆరోపణలతో విచారణ చేపట్టారు. ఈఏడాది ఫిబ్రవరిలో షివోమి మాజీ ఎండీ మనుకుమార్ జైన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒప్పో, వివో, షివోమి సహా పలు కంపెనీలు మనీలాండరింగ్ యాక్ట్ ను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. ఈఏడాది  జులైలో వివో కంపెనీ సహా.. ఇతర సంస్థలకు చెందిన ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మేఘాలయా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్... ఇలా మొత్తం 44 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.

వివో కంపెనీ భారత్ లో పన్నులు ఎగ్గొట్టి టర్నోవర్ లో దాదాపు 50 శాతం నిధుల్ని చైనాకు తరలించిందని తేల్చింది ఈడీ. 2017 నుంచి 2021 మధ్యకాలంలో మొత్తం 62 వేల 476 కోట్లు ఉంటుందని తెలిపింది. ఒప్పో కూడా పన్నులు ఎగ్గొటనట్లు తెలిపింది. మొత్తం 4 వేల 389 కోట్లు వరకు కస్టమ్స్ డ్యూటీ ఎగవేసింది. షివోమి కూడా 653 కోట్ల ఎగవేతకు పాల్పడింది. ఈ మూడు సంస్థలకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది.