ఆమనగల్లు కోర్టు లో విధులు బహిష్కరించిన న్యాయవాదులు 

  • భద్రాచంలో న్యాయవాది అరెస్ట్​లో పోలీసుల తీరుపై నిరసన

ఆమనగల్లు, వెలుగు :  భద్రాచలంలో న్యాయవాది కృష్ణ ప్రసాద్ అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును  నిరసిస్తూ మంగళవారం ఆమనగల్లు కోర్టు లో విధులను బహిష్కరించి న్యాయవాదులు  నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకమైనదని, ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రతినిత్యం ప్రజల పక్షాన పోరాడే న్యాయవాదికి బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం న్యాయవ్యవస్థకు అవమానకరమన్నారు. ఈ విషయంపై బార్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వారు వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు జగన్, ఆంజనేయులు, రామకృష్ణ, మధు, శేఖర్, మల్లేశ్​, జగన్ గౌడ్, గణేశ్​ గౌడ్, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కల్వకుర్తి:  కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు  కే వెంకటరమణ,  ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రాజ్ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.    ఓ న్యాయవాదిని అక్రమ కేసులో,  సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకురావడం  దుర్మార్గ చర్య  అని విమర్శించారు.  పోలీసులు  అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు.    ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జి వెంకట్ గౌడ్, జయ లక్ష్మీనారాయణ,  అమరేందర్,  నరేందర్ రెడ్డి,  ఎస్ వెంకటేశ్​,  మల్లేశ్,  జయంత్ కుమార్
 పాల్గొన్నారు.