తిరుపతి: అంబేడ్కర్ లా కాలేజీ పరీక్ష హాల్ లోనే కుప్పకూలి న్యాయ విద్యార్థి మృతి చెందాడు. శనివారం జరిగిన ఘటన కలకలం రేపింది. చెన్నై లోని తాంబరం ప్రాంతానికి చెందిన బాలమురుగన్ అంబేడ్కర్ లా కాలేజీ లో పరీక్ష రాస్తుండగానే ఫిట్స్ వచ్చినట్లు కాలేజీ వర్గాలు చెబుతున్నాయి. చికిత్స కోసం హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించగా.. ఆస్పత్రికి చేరేలోపే మృతి చెందినట్లు చెబుతున్నారు. కొత్త సంవత్సరం వేళ కాలేజీలో.. బయటా అందరూ సంతోషంగా ఉన్న సమయంలో జరిగిన ఘటన విషాదంలో ముంచెత్తింది.
