కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్) నుంచి ఇస్రో నిర్వహించిన పునర్వినియోగ వాహక నౌక పుష్పక్ ప్రయోగం మూడోసారి విజయవంతమైంది. స్వదేశీ స్పేస్ షటిల్‌గా పిలిచే ఈ వాహక నౌక ప్రయోగాన్ని ఈసారి మరింత కఠిన పరిస్థితుల్లో నిర్వహించింది. నింగిలోకి ప్రయోగించే ఉపగ్రహాల విడిభాగాలు, వాటిని తీసుకెళ్లే వాహక నౌక(స్పేస్‌షిప్)ల పునరుద్ధరణ దిశగా ఇస్రో పుష్పక్ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.
ఈ ప్రయోగం రీయూజబుల్ లాంచ్ వెహికిల్(ఆర్ఎల్వీ) అభివృద్ధికి అవసరమైన కీలక సాంకేతిక పరిజ్ఙానాన్ని పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని మరోసారి చాటి చెప్పింది. ఇంతకుముందు నిర్వహించిన రెండు ప్రయోగాలు విజయవంతం కాగా, మూడో ప్రయోగాన్ని మరిన్ని సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో చేపట్టింది. స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్ సామర్థ్యాన్ని పుష్పక్ మళ్లీ ప్రదర్శించింది.
పుష్పక్‌ను ఇండియన్ నేవీకి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా నింగిలోకి తీసుకెళ్లి రన్‌వేకి నాలుగు కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి జార విడిచారు. అనంతరం తనంతటతానుగా క్రాస్ రేంజ్ కదిలికలను నియంత్రిస్తూ పుష్పక్ రన్ వే దిశగా వచ్చి సెంటర్ లైన్ వద్ద కచ్చితమైన సమాంతర ల్యాండింగ్‌ను ప్రదర్శించింది.
తక్కువ లిఫ్ట్ టుడ డ్రాగ్ నిష్పత్తితో కూడిన ఏడో డైనమిక్ కాన్ఫిగరేషన్ వల్ల పుష్పక్ ల్యాండింగ్ వేగం గంటకు 320 కిలోమీటర్ల కంటే
ఎక్కువగా ఉంది.