టూల్స్ గాట్జెట్స్ : హ్యాండ్ రెయిల్
పెద్దవాళ్లు కూర్చొని లేదా పడుకుని లేచిన వెంటనే చేతికి ఎటువంటి ఆధారం చిక్కకపోతే కిందపడే అవకాశం ఉంది. అలాగే చిన్న పిల్లలు కూడా. అలా పడిపోకుండా ఉండేందుకు హెల్పింగ్ హ్యాండ్ రెయిల్‌ను తెచ్చింది హెపెక్సా కంపెనీ. హెల్పింగ్ హ్యాండిల్ హ్యాండ్రెయిల్ పిల్లలు, పెద్దలు బాత్రూమ్లో పడిపోకుండా కాపాడుతుంది. మల్టీ కలర్లో దొరికే ఈ హ్యాండిల్‌ను టాయిలెట్ సీట్ మీద నుంచి లేచేటప్పుడు, షవర్ బాత్ చేసి బయటకు వచ్చేటప్పుడు, చెయిర్ మీద కూర్చొని లేచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు సపోర్టుగా వాడొచ్చు. దీన్ని పెట్టేందుకు గోడను డ్రిల్ చేయాల్సిన అవసరం లేదు.
అలాగని ఒక ప్లేస్‌లో ఫిక్స్ చేయాల్సిన పనిలేదు. సాఫ్ట్‌గా ఉండే గోడల మీద పెట్టగానే కొన్ని సెకన్లలో అతుక్కుంటుంది. సక్షన్ ఎఫెక్ట్‌తో ఇది గోడలను గట్టిగా పట్టి ఉంచుతుంది. అవసరం లేనప్పుడు ఆ ప్లేస్ నుంచి తీసేయొచ్చు. అయితే.. ఈ హ్యాండిల్‌ను ఇన్స్టాల్ చేశాక గోడను గట్టిగా పట్టుకుందా? లేదా? అనేది గమనించుకోవడం మరిచిపోవద్దు. ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారుచేసిన దీన్ని వాడడం చాలా ఈజీ.
ధర: రూ. 329
ఎలక్ట్రిక్ కట్టర్
వయసు మీద పడ్డాక చిన్న పనులే అనుకున్నవి కూడా చాలా భారంగా అనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా వంటచేసే పెద్ద వాళ్లకు కూరగాయలు తరిగేందుకు ఓపిక ఉండదు చాలాసార్లు. ఆ ఇబ్బంది నుంచి తప్పించేందుకు స్కైటోన్ బ్రాండ్ చాపర్ మీట్ గ్రైండర్స్ను తయారుచేసింది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ బౌల్‌తో వస్తుంది. రెండు స్పీడ్ మోడ్స్ ఉన్నాయి. అందులో ఒకటో నెంబర్‌ను నొక్కితే స్లో స్పీడ్‌తో పనిచేస్తుంది. సాధారణంగా దీన్ని మాంసాన్ని తరిగేందుకు వాడతారు.
రెండో బటన్ వెజిటబుల్, ఫ్రూట్స్‌కి పనికొస్తుంది. ఇందులో రెండు, ఆరు లీటర్ల వెరైటీలు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మల్టీ ఫంక్షనల్ ఫుడ్ చాపర్ ఇది. ఎలక్ట్రిక్ మీట్ కట్టర్ 700 వాట్స్ పవర్‌తో నడుస్తుంది. అందుకని చాలా ఎఫెక్టివ్‌గా, స్పీడ్‌గా పనిచేస్తుంది. ఇందులోని నాలుగు స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ 4డి డిజైన్‌తో ఉంటాయి. దానివల్ల పైన, కింద ఉన్న బ్లేడ్స్ ఫుడ్‌ని 360 డిగ్రీల యాంగిల్లో తరుగుతుంది.ఈ కట్టర్‌తో స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ వస్తుంది. గ్లాస్ బౌల్స్‌తో పోల్చితే ఇది స్ట్రాంగ్‌గా ఉంటుంది. షాక్ ప్రూఫ్, మన్నిక ఎక్కువ. దీన్ని వాడడం ఎంత ఈజీగా ఉంటుందో శుభ్రం చేయడం కూడా అంత ఈజీ. ఎందుకంటే ఎలక్ట్రిక్ కట్టర్‌ను డిసెంబుల్ చేసి, శుభ్రం చేయడమే. కట్టర్‌తో పాటు నాన్ స్లిప్ మ్యాట్ వస్తుంది. బౌల్‌ను మ్యాట్ మీద పెట్టి తరిగే పని సులువుగా చేసుకోవచ్చన్నమాట.
ధర: రూ. 1,474
మెడిసిన్ రిమైండర్
పెద్దవాళ్లలో చాలావరకు రోజూ వేసుకునే మెడిసిన్‌ను ఒక్కోసారి వేసుకోవడం మర్చిపోతుంటారు. ఇది సహజమే కావచ్చు. కానీ మెడిసిన్ అలా స్కిప్ కావడం అంత మంచిది కాదు కదా! అందుకే ‘రెడిసిన్ మెడ్ సోల్’ కంపెనీ ‘రిమెడ్ ప్లస్’ అనే మంత్లీ పిల్ ఆర్గనైజర్ బాక్స్‌ను తయారుచేసింది. ఆడియో, విజువల్ ఇండికేషన్ ద్వారా మెడిసిన్ రిమైండర్ నోటిఫికేషన్ వస్తుంది. ఇది పోర్టబుల్ ట్రావెల్ పిల్ బాక్స్. పెద్ద కంపార్ట్మెంట్స్ ఉన్న ఈ బాక్స్‌లో ఒక నెలకు సరిపడా మందులు పెట్టుకోవచ్చు.
ఒక్కో మెడిసిన్ ఒక్కో పోర్ట్‌లో పెట్టుకునేలా ఐదు పోర్ట్‌లు ఉంటాయి. మాయిశ్చర్ ప్రూఫ్‌గా తయారుచేసిన రిమెడ్ ప్లస్ బాక్స్ రెక్టాంగిల్ షేప్‌లో ఉంటుంది. ఇంటరాక్టివ్ ఇ–పేపర్ డిస్ప్లే ఉన్న ఈ బాక్స్‌లో ఉండే బ్యాటరీ లైఫ్ పది రోజులు. మొబైల్లో రెడిసిన్(Redicine) యాప్ వేసుకుంటే ఈ బాక్స్‌తో కనెక్ట్ అయ్యి పనిచేస్తుంది.
ఎలా పనిచేస్తుందంటే... ఈ డివైజ్‌ను స్టార్ట్ చేసేందుకు ముందు భాగంలో ఉన్న స్విచ్ పక్కకి జరపాలి. డివైజ్ వైఫైను సింగిల్ ట్యాప్‌తో ఆన్ చేయొచ్చు. మొబైల్‌ను డివైజ్‌కి వైఫై ద్వారా కనెక్ట్ చేయాలి. తరువాత రెడిసిన్స్ మొబైల్ అప్లికేషన్‌ను యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేయాలి. డివైజ్‌ను యాప్‌లో చెప్పిన సింపుల్ స్టెప్స్‌తో కస్టమైజ్చేశాక మెడిసిన్ స్ట్రిప్స్‌ను కంపార్ట్మెంట్స్లో పెట్టాలి. తరువాత మెడిసిన్ వివరాలను యాడ్ చేసి రెడిసిన్ యాప్‌లో షెడ్యూల్ చేస్తే మెడిసిన్ రిమైండర్ రెడీ.
ఒకసారి ఇది సెట్ చేసుకున్నారంటే... వేసుకోవాల్సిన మెడిసిన్ డోసేజ్ వివరాలను డిస్ప్లేలో చూపిస్తుంది. ఆడియో విజువల్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. దాంతోపాటు మొబైల్లో డిటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుంది. ఇక మెడిసిన్ టైం గురించి మర్చిపోయినా పర్వాలేదు. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. మెడిసిన్ వేసుకోవాల్సిన టైంకి కంపార్ట్మెంట్ నుంచి మెడిసిన్ తీసుకుని వేసుకోవడమే. అలాగే మెడిసిన్ వేసుకున్న తరువాత కూడా నోటిఫికేషన్ వస్తుంది. మొబైల్ యాప్‌లో మెడిసిన్ వేసుకోవడానికి సంబంధించిన పూర్తి వివరాలు కనపడుతుంటాయి. దీన్ని హై క్వాలిటీ మెడికల్ గ్రేడ్ ప్లాస్టిక్మెటీరియల్తో తయారుచేశారు.
ధర: రూ. 4,900
పోర్టబుల్ మసాజర్
రకరకాల కారణాల వల్ల చాలామందికి పాదాల నొప్పులు వస్తుంటాయి. పెద్దవాళ్లయితే ఈ నొప్పులతో బాగా ఇబ్బంది పడుతుంటారు. అలాగని కాళ్లు నొక్కమని ప్రతిరోజూ ఎవరిని అడగాలి? అందుకే ఎవరిమీదా ఆధారపడకుండా నొప్పుల నుంచి బయటపడేసేందుకు మార్కెట్లోకి వచ్చిందే ఆర్క్ హీల్ ఫుట్ మసాజర్. దీన్ని బీట్ఎక్స్పి కంపెనీ తయారుచేసింది. ఈ పోర్టబుల్ ఫుట్ మసాజర్‌ను ఇంట్లో వాడుకునేందుకు ప్రత్యేకంగా తయారుచేశారు.
పోర్టబుల్ మసాజర్ కాబట్టి మీరు ఊరు లేదా టూర్‌కి వెళ్తున్నా మీతో పట్టుకు వెళ్లొచ్చు. దీన్ని ఇంట్లో అడాప్టర్ లేదా కార్ అడాప్టర్ పవర్‌కి పెట్టుకుని వాడొచ్చు. నీడింగ్, రోలింగ్ టెక్నాలజీతో ఉన్న ఈ మసాజర్ వాడకం కూడా సులభమే. కంట్రోల్ పానెల్తో మసాజ్ ఇంటెన్సిటీని కంట్రోల్ చేయొచ్చు. అలాగే క్లాక్‌వైజ్, యాంటీ క్లాక్‌వైజ్ బటన్స్‌తో మసాజ్ డైరెక్షన్ సెట్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రారెడ్ హీటింగ్ సిస్టమ్ నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది అంటున్నారు తయారీదారులు. బీట్ఎక్స్పి బ్రాండ్ తెచ్చిన ఈ మసాజర్ ఆర్క్, హీల్, లెగ్, ఫుట్ మసాజ్ చేస్తుంది. మసాజర్ బరువు 1.4 కిలోలు. పాదాలకోసం తయారుచేసిన ఈ మసాజర్‌ను కాళ్ల పిక్కలు, మెడ, తల వంటి భాగాలకు నొప్పుల నుంచి రిలీఫ్ కావాలన్నా వాడుకోవచ్చు.
ధర: రూ. 2,999