గవర్నమెంట్ వెబ్సైట్ ‘సంచార్‌సాథీ’ ద్వారా గతంలో తీసుకున్న నెంబర్లు, ప్రస్తుతం వాడుతున్న సిమ్‌కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాదు గతంలో తీసుకుని వాడని సిమ్‌కార్డ్స్‌ను ఆన్లైన్లోనే బ్లాక్ చేసేయొచ్చు కూడా. https://sancharsaathi.gov.in/ వెబ్సైట్లోకి వెళ్లాలి. సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ కేటగిరీలో ‘నో యువర్ మొబైల్ కనెక్షన్స్(know your mobile connections)’ క్లిక్ చేయాలి. ఈ సర్వీస్ టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ (టీఎఎఫ్సీఓపీ) అందిస్తోంది.
‘నో యువర్ మొబైల్ కనెక్షన్స్’పై క్లిక్ చేసిన వెంటనే కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. తరువాత కింద ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, వ్యాలిడేట్ క్యాప్చా మీద నొక్కాలి. పైన ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాని కింద ఉన్న బ్లాక్‌లో ఎంటర్ చేసి లాగిన్ కావాలి. అప్పుడు మన పేరుతో ఏ నెంబర్లు రిజిస్టర్ అయ్యాయో వాటి వివరాలతో లిస్ట్ వస్తుంది. వాటిలో ఏదైనా నెంబర్ బ్లాక్ చేయాలనుకుంటే పక్కనే ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. వాటిని ఫాలో అయ్యి, క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. ప్రాసెస్ అయిపోయాక చివరిగా లాగవుట్ చేయాలి.