ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం గూగుల్ వ్యాలెట్ యాప్ తెచ్చింది. వ్యాలెట్ అంటేనే పేమెంట్‌కి పనికొచ్చేది. కానీ, ఇది అలాంటి వ్యాలెట్ కాదు. బ్యాంక్ కార్డ్స్‌ను స్టోర్ చేయదు. దానివల్ల డిజిటల్ పేమెంట్స్ చేయలేరు. ఈ యాప్‌లో రివార్డ్స్, టికెట్స్, కారు కీస్ స్టోర్ చేసుకునేలా పనిచేస్తుంది. ఇండియాలో రిలీజ్ అయిన ఈ వ్యాలెట్ ఇంటర్నేషనల్ వెర్షన్‌కు భిన్నంగా ఉంటుంది. ఇది గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.
ఎలా వాడాలి?
గూగుల్ ప్లేస్టోర్ నుంచి గూగుల్ వ్యాలెట్ యాప్‌ని డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేశాక గూగుల్ వ్యాలెట్ యాప్ స్క్రీన్‌పై చూపించే సూచనలను ఫాలో కావాలి. కొత్తవాళ్లయితే పేమెంట్ కార్డ్‌ని యాడ్ చేయమనే ప్రాంప్ట్ వస్తుంది. దీన్ని కెమెరాతో స్కాన్ చేయొచ్చు లేదా వివరాలను మాన్యువల్‌గా ఎంటర్ చేయొచ్చు. ఇప్పటికే గూగుల్ పే వాడుతుంటే.. కార్డ్స్, టికెట్స్, పాస్‌లను గూగుల్ వ్యాలెట్‌లోని మీ డాక్యుమెంట్స్‌లో చూడొచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్లో సేఫ్టీ కోసం స్క్రీన్ లాక్ కూడా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఫోన్‌తో కాంటాక్ట్‌లెస్ పేమెంట్ల కోసం డివైజ్ సాఫ్ట్వేర్ అవసరాలకు అనుగుణంగా ఉందనేది ముందు నిర్ధారించుకోవాలి. అంతేకాకుండా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సి) ఆన్ చేసి ఉండాలి. గూగుల్ వ్యాలెట్‌తో కాంటాక్ట్‌లెస్ పేమెంట్లు చేయొచ్చు. కొన్ని వెర్షన్లకు మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేయదు. జూన్ 10 నుంచి గూగుల్ వ్యాలెట్ పై(pie) 9 కన్నా తక్కువ ఆండ్రాయిడ్ వెర్షన్లు లేదా 2.x కంటే తక్కువ ఉన్న wear OS వెర్షన్లను వాడే ఫోన్స్‌లో పనిచేయదు.