పుల్వామా కేసులోని టెర్రరిస్టు హతం

పుల్వామా కేసులోని టెర్రరిస్టు హతం

శ్రీనగర్: జమ్ము, కాశ్మీర్‌‌‌‌లో శుక్రవారం జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌‌‌లో మరణించిన టెర్రరిస్టులలో ఒకరిని జైషే మహమ్మద్‌‌ (జేఈఎం) టాప్ టెర్రరిస్టు సమీర్‌‌‌‌ దార్‌‌‌‌గా పోలీసులు గుర్తించారు. 2019లో పుల్వామా అటాక్‌‌తో సంబంధం ఉన్న చివరి టెర్రరిస్టు ఇతడేనని కాశ్మీర్‌‌‌‌ ఐజీ విజయ్‌‌ కుమార్‌‌‌‌ కన్ఫమ్ చేశారు. ‘‘జమ్ము, కాశ్మీర్‌‌‌‌లోని అనంతనాగ్‌‌లో డిసెంబర్‌‌‌‌ 31న జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌‌‌లో ముగ్గురు టెర్రరిస్టులు చనిపోయారు. ఇందులో పుల్వామా అటాక్​లో పాల్గొన్న సలీమ్​ దార్​ కూడా ఉన్నాడు. అందులో ఇప్పటి వరకు ప్రాణాలతో ఉన్న టెర్రరిస్టు ఇతడొక్కడే. డెడ్​బాడీలకు డీఎన్‌‌ఏ శాంపిల్‌‌ను టెస్ట్‌‌ చేయించబోతున్నాం’’ అని శనివారం తెలిపారు. ‘‘ఐఈడీలను తయారు చేయడంలో, సెక్యూరిటీ సిబ్బందిపై వాటిని ఉపయోగించడంలో సంస్థలోని వారికి సమీర్ దార్‌‌‌‌ ట్రైనింగ్‌‌ ఇస్తుంటాడు. లోకల్‌‌గా ఉన్న యువకులను జేఈఎంలోకి చేర్పించే బాధ్యతలతోపాటు వారికి ఆయుధాలను సప్లై చేస్తుంటాడు’’ అని చీనార్ కోర్ కమాండింగ్ జనరల్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే చెప్పారు.